ఆసరా పింఛన్లు పంపిణీ చేసిన జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు

జహీరాబాద్ సెప్టెంబర్ 19( జనంసాక్షి) న్యాల్కల్ మండలం లోని హుస్సేన్ నగర్, చీకుర్తి, కాకిజన్ వాడ, మూర్తుజపుర్, రాఘవపూర్, హుమ్నాపుర్, చాక్కి, మీరియంపుర్ గ్రామాల్లో సోమవారం ఆసరా పింఛన్  కార్డులను శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు, గీత కార్మికులకు, చేనేత కార్మికులకు, మొద్దు కాలు ఉన్నవారికి, ఫైలేరియా వ్యాధి ఉన్నవారికి, ఎయిడ్స్ వ్యాధి ఉన్నవారికి, రూ .2,016, వికలాంగులకు రూ.3,016 ఇచ్చే రాష్ట్రం ఏదైనా ఉంది అంటే భారతదేశంలోనే అది ఓకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్టం   అని అన్నారు.ఆయా గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో  జెడ్పీటీసీ స్వప్న భాస్కర్, మండల అధ్యక్షులు రవీందర్, మాజీ మండల అద్యక్షులు నర్సింహ రెడ్డీ, సీనియర్ నాయకులు బశ్వరాజ్ పటేల్, ఎంపీటీసీ లు  శ్రీనివాస్ రెడ్డి, చంద్రన్న, మేత్రి శివానంద, శ్రీపతి, సర్పంచులుసరోజినీ భుమారెడ్డి, పి శకుంతల వీర రెడ్డీ, సోఫియా బేగం మజీద్ పటేల్, సంగీత రాజు, అబ్బెంద మర్థమ్మ, కవిత చంద్రశేఖర్ రెడ్డి, మారుతి, అమీర్, మల్ రెడ్డి,, ఉప సర్పంచ్ లు, పార్టీ గ్రామ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, ఖైరాత్ పటేల్, శ్రీకాంత్, రామకృష్ణ రెడ్డీ, అనిల్, మోహన్ రెడ్డి, మాజీ సర్పంచ్ లు, మండల మైనారిటీ అద్యక్షులు సయ్యద్ హనీఫ్, నాయకులు రత్నం, జనార్ధన్ రెడ్డి, కార్యకర్తలు తదితరులు  పాల్గొన్నారు.