ఆసరా పెన్షన్లు అభాగ్యులకు వరం

 

తెలంగాణ రాష్ట్ర ఢిల్లీ అధికార ప్రతినిధి మంద జగన్నాథం

ఇటిక్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 13 తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ నిరుపేదలకు అండగా నిలుస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ఢిల్లీ అధికార ప్రతినిధి నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మంద జగన్నాథం అన్నారు. ఇటిక్యాల మండల పరిధిలోని ఉదండాపురం గ్రామంలో 92 మంది ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు మంగళవారం పెన్షన్ కార్డులను పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై ఆసరా పెన్షన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన అసరా పెన్షన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి 10 లక్షల మంది కొత్త పెన్షన్ దారులకు లబ్ధి చేకూరుస్తున్నట్లు మందా జగన్నాథం అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు వితంతులకు 200, వికలాంగులకు 500 రూపాయల పెన్షన్ ఇచ్చేవారని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ వృద్ధులకు, వితంతువులకు 2016, వికలాంగులకు 3016 రూపాయల ఆసరా పెన్షన్ విధానానికి శ్రీకారం చుట్టారని ఆ ఘనత కేసిఆర్ కే చెందుతుందన్నారు. 57 సంవత్సరాలు పైబడిన వారందరికీ ఆసరా పెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్నారని రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి అమలు చేస్తున్న ముఖ్యమంత్రి దేశంలో ఎవరు లేరన్నారు. ఈ కార్యక్రమంలో అలంపూర్ టిఆర్ఎస్ పార్టీ మాజీ ఇంచార్జి మంద శ్రీనాథ్, సర్పంచ్ అయ్యమ్మ, ఎంపీటీసీ కేశన్న, పంచాయతీ కార్యదర్శి సరస్వతి, లబ్ధిదారులు ప్రజలు పాల్గొన్నారు.