ఆసరా పెన్షన్లు కార్డులు వెంటనే పంపిణీ చేయాలి. సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పారేపల్లి శేఖర్ రావు.
నేరేడుచర్ల (జనంసాక్షి) న్యూస్.ఆసరా పెన్షన్స్ వెంటనే పంపిణీ చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పారేపల్లి శేఖర్ రావు మున్సిపల్ అధికారులను డిమాండ్ చేశారు. గురువారం నాడు స్థానిక సిపిఎం కార్యాలయం అరబండి భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అన్ని రకాల ఆసరా పెన్షన్స్ వికలాంగుల ఒంటరి మహిళల వృద్ధాప్య వితంతు ఆసరా పెన్షన్లు మున్సిపాలిటీ పరిధిలోని సుమారు 425 పెన్షన్ మంజూర అయి గత 15 రోజులు దాటిన నేటికీ లబ్ధిదారులకు పెన్షన్ కార్డులు ఎందుకు పంపిణి చేయలేదని అధికారులను డిమాండ్ చేశారు.మండలంలోని అన్ని గ్రామాల్లో పెన్షన్ కార్డులు పంపిణీ చేసినప్పటికీ నేరేడుచర్ల మున్సిపాలిటీలో ఎందుకు పంపిణీ చేయలేదో అధికారులు సమాధానం చెప్పాలని వారు అన్నారు.ఇంకా అర్హత కలిగి ఉండి పెన్షన్ దరఖాస్తు చేసుకున్న వారందరికీ పెన్షన్ను మంజూరు చేయాలని,పాత పెన్షన్ దారులకు గత రెండు నెలలుగా పెన్షన్ రూపాయలు చెల్లించడం లేదని పెన్షన్ పై ఆధారపడి బతుకుతున్న నిరుపేదల జీవితాలు దుర్భరంగా గడుపుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి కోదమ గుండ్ల నగేష్, సిఐటియు మండల కన్వీనర్ నీలా రామ్మూర్తి,కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు మర్రి నాగేశ్వరరావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.