ఆసరా ఫింఛన్లు పంపిణీ చేసిన సర్పంచ్
బొమ్మలరామారం. జనం సాక్షి మండలం మర్యాల గ్రామంలో సర్పంచ్ కుర్మిండ్ల దామోదర్ గౌడ్ ఆధ్వర్యంలో ఆసరా పెన్షన్ మంజూరు పత్రాలు పంపిణీ చేశారు.మర్యాల గ్రామానికి ఇటీవల నూతనంగా మంజూరు అయిన 56 ఆసరా ఫెన్షన్ మంజూరు పత్రాలు లబ్ధిదారులకు పంపిణీ చేసిన అనంతరం సర్పంచ్ కుర్మిండ్ల దామోదర్ గౌడ్ మాట్లాడుతూ బడుగు బలహీనవర్గాల వారి అభ్యున్నతితో పాటు ఆసరా ఫెన్షన్ లు, రైతు బంధు,రైతు భీమా, కళ్యాణాలక్ష్మి,షాది ముబారక్,ఉచిత విద్యుత్,సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణ ప్రజల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని,దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు రూపకల్పన చేసి గొప్పగా అమలు చేస్తున్నారని వారు అన్నారు.ఈ సందర్భంగా సి.ఎం.కే.సి.ఆర్.చిత్ర పటానికి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేసి కృతఙ్ఞతలు తెలిపారు.రేపు బొమ్మలరామారం మండల కేంద్రంలో ని ఓం శివ పంక్షన్ హాల్లో నిర్వహించే ఆసరా పెన్షన్ గుర్తింపు కార్డులు లబ్ది దారులకు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అందజేస్తారు కావున పెన్షన్ మంజూరైన లబ్ది దారులను హాజరు కావాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఐదవ వార్డు సభ్యుడు అన్నారం గణేష్, ముద్దం ఉదయ్ కుమార్ రెడ్డి,ప్యారారం రాములు,కొరమైన సురేష్,
తుంకుంట సాయికుమార్,
లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు