ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండో రౌండ్ లో సైనా, సింధు
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రెండో రౌండ్ కు దూసుకెళ్లారు భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధు. మహిళల సింగిల్స్‌లో సంగ్ జీ హువాన్(దక్షిణకొరియా)తో తలపడిన సైనా నెహ్వాల్ 21-10, 21-16తో విజయం సాధించి రెండో రౌండ్‌లోకి అడుగు పెట్టింది. మరో మ్యాచ్‌లో సయాకా సాటో(జపాన్)తో తలపడిన పీవీ సింధు 21-17, 14-21, 21-18 తేడాతో విజయం సాధించింది. పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్, సాయి ప్రణీత్ విజయం సాధించారు. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప – సిక్కిరెడ్డి జోడీ, పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ జోడీ తొలి రౌండ్‌లో విజయం సాధించి రెండో రౌండ్ లోకి అడుగు పెట్టారు.