‘ఆ ఎన్నిక జరిగిన తీరుకు సిగ్గుపడుతున్నా’

హైదరాబాద్,(జ‌నంసాక్షి) : రాష్ట్ర విభజన చట్టంలో  భాగంగా ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీల అమలుకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా కోటి సంతకాల సేకరణ కొనసాగుతోందని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. ప్రజల మద్దతుతో పాటు ఢిల్లీలో అన్ని పార్టీల మద్దతు కూడగడతామని ఆయన మంగళవారమిక్కడ తెలిపారు. విభజన చట్టంలో సవరించాల్సిన లొసుగులేంటో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడే చెప్పాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు.

తిరుపతి ఉప ఎన్నిక జరిగిన తీరు అత్యంత దారుణమని అధికారులు, టీడీపీ నేతలు కుమ్మక్కయ్యారని రఘువీరారెడ్డి ఆరోపించారు. ప్రజాస్వామ్యవాదిగా ఆ ఎన్నిక జరిగిన తీరుకు సిగ్గుపడుతున్నామని ఆయన అన్నారు. తిరుపతి ప్రజలు కూడా ఇతర ప్రాంత టీడీపీ కార్యకర్తలతో లక్ష ఓట్లు రిగ్గింగ్ చేయించారన్నారు. విభజన చట్టంలో ఏపీకి ఇచ్చిన హామీలను వచ్చే పార్లమెంట్ బడ్జెట్లో, రాష్ట్రపతి ప్రసంగంలో పొందుపరచాలని రఘువీరా డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశామన్నారు.