ఆ మంచిరోజులు బడాపెట్టుబడిదారులకే…అన్నా హజారే

ANNA HAJARE
రాలెగాంసిద్ధి, ఫిబ్రవరి 17(జనంసాక్షి): ఎన్నికల్లో గెలుపొందేందుకు బీజేపీ చేపట్టిన ప్రచారంలో భాగంగా చెప్పినట్లు మంచి రోజులు వచ్చాయని, అయితే అవి కేవలం పెట్టుబడిదారులకు మాత్రమేనని, సామాన్యుడి పరిస్థితిలో ఎంతమాత్రం మార్పురాలేదని సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ రైతుల సంగతి గాలికి వదిలేసి కేవలం పారిశ్రామిక వేత్తలగురించే ఆలోచిస్తున్నారని సామాజిక కార్యకర్త అన్నా హజారే విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో మోదీ పేర్కొన్న అచ్ఛే దిన్‌ పారిశ్రామికవేత్తలకేనన్నారు. మోదీ అనుసరిస్తున్న విధానాలతో భారత్‌ భవిష్యత్తు బాగుపడదని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ భూసేకరణ ఆర్డినెన్స్‌కి వ్యతిరేకంగా అన్నాహజారే త్వరలో జంతర్‌మంతర్‌ వద్ద దీక్ష చేపట్టనున్న సంగతి తెలిసిందే.