ఆ విమానాన్ని మేం వెలికి తీస్తాం – చైనా

1

ప్రమాద స్థలికి బయలుదేరిన నౌక

ఢిల్లీ/ సింగపూర్‌, జనవరి6(జనంసాక్షి): జావా సముద్రంలో కుప్పకూలిపోయిన ఏయిర్‌ ఏషియా విమాన శఖలాలను తాము వెలికీ తీస్తామనీ చైనా ముందుకు వచ్చింది. సముద్రంలో కూలిపోయిన సురబయ-సింగపూర్‌ ఎయిర్‌ ఏషియా విమానాన్ని సముద్ర గర్భంలో ఖచ్చితంగా గుర్తించి, వెలికితీయడానికి చెయనాకు చెందిన భారీ రీ|క రంగంలో దిగనుంది. ఇప్పటి వరకు జరిగిన ప్రయత్నాలేవీ ఫలితాన్ని ఇవ్వలేదు. ధ్వని తరంగాల ఆధారంగా ఆచూకీ కనిపెట్టే అధునాతన యంత్రాలను ఉపయోగిస్తూ వివిధ దేశాల అన్వేషకులు తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నా కీలకమైన బ్లాక్‌బాక్స్‌ ఇంకా లభ్యం కాలేదు. సముద్ర గర్భంలో బురదలో ఇది కూరుకుపోయి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చెయనా రీ|కాదళానికి చెందిన రీ|క సోమవారం రాత్రి బయల్దేరింది. ప్రమాదస్థలికి ఇది 9వ తేదీన చేరుకుంటుంది.

సముద్ర గర్భానికి చేరే ప్రయత్నంలో ఈతగాళ్లు

మంగళవారం మరో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో మొత్తం 39 మృతదేహాలను ఇప్పటి వరకు బయటకు తీసినట్లయింంది. వాతావరణం మెరుగుపడడంతో గజ ఈతగాళ్లు సముద్ర గర్భం వరకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎరుపు, నారింజ, తెల్లని రంగుల్లో ఉన్న భారీ శకలాలను రష్యా బృందం గుర్తించిందని స్థానిక పత్రికలు వెల్లడించాయి. చతురస్రం మాదిరిగా ఉన్న నల్లని మరో వస్తువూ దొరికిందని తెలిపాయి. ఎయిర్‌ ఏషియా విమానం తగిన అనుమతులు లేకుండానే ప్రయాణం సాగించిందన్న ఆరోపణల నేపథ్యంలో సురబయలోని జువాండా అంతర్జాతీయ విమానాశ్రయానికి చెందిన నలుగురు గగనతల రద్దీ నియంత్రణ (ఎ.టి.సి.) అధికారులను విధుల నుంచి తొలగించారు. విమానాన్ని నడిపే సంస్థలే సంబంధిత దేశాల నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని సింగపూర్‌ పౌర విమానయాన సంస్థ స్పష్టం చేసింది.