ఆ సెన్సెషన్‌ న్యూస్‌ ఇదే

2

హైదరాబాద్‌,మే19(జనంసాక్షి): ఐటీ దిగ్గజం యాపిల్‌ కంపెనీ సింబల్‌ ఇప్పుడు పింక్‌ అయ్యింది.  టిమ్‌కుక్‌ అందించిన ఆ యాపిల్‌ను మంత్రి కేటీఆర్‌ పింక్‌గా మార్చేశారు. ఇవాళ అదే బిగ్‌ న్యూస్‌. విూకో పెద్ద వార్త చెబుతానంటూ మంగళవారం మంత్రి కేటీఆర్‌ ఓ ట్వీట్‌ చేశారు. ఆ సస్పెన్స్‌ నెట్‌జన్లను తెగ అట్రాక్ట్‌ చేసింది. విపరీతంగా స్పందనలు వచ్చాయి. ఆ హైటెన్షన్‌ వెయిటింగ్‌కు ఐటీ మంత్రి కేటీఆర్‌ తనదైన స్టయిల్లో ఫినిషింగ్‌ ఇచ్చారు. పింక్‌ రంగు వేసిన యాపిల్‌ కంపెనీ సింబల్‌ను ట్వీట్‌ చేస్తూ ఇదే బిగ్‌ న్యూస్‌ అన్నారు.   ప్రపంచ మేటి ఐటీ కంపెనీ మన హైదరాబాద్‌కు రావడం,ఇక్కడ తమ సంస్థను ఏర్పాటు చేయడమే గుడ్‌ న్యూస్‌ అంటూ కెటిఆర్‌ ట్వీట్‌ చేశారు.  గత ఏడాది మే నెలలోనే ప్రఖ్యాత సోషల్‌ సైట్‌ గూగుల్‌ కంపెనీ కూడా హైదరాబాద్‌కు వచ్చింది. ఈ ఏడాది అదే నెలలో యాపిల్‌ సంస్థ రావడం గర్వకారణమని కేటీఆర్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ప్రపంచంలో ఉన్న మేటి అయిదు టెక్‌ కంపెనీల్లో నాలుగు కంపెనీలకు హైదరాబాద్‌లో ఆఫీసులు ఉన్నాయి. గూగుల్‌, అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌ తర్వాత ఇప్పుడు యాపిల్‌కి కూడా హైదరాబాద్‌ సెంటర్‌ కావడం విశేషం. వాస్తవానికి కేటీఆర్‌ బిగ్‌ న్యూస్‌ కోసం నెట్‌జన్లు ఎంతో ఆశగా ఎదురుచూశారు. ఆయన ఏం విషయం చెబుతారా అని ఆసక్తిగా ట్విట్టర్‌ను ఫాలోయ్యారు. యాపిల్‌ సంస్థ అధినేత టిమ్‌కుక్‌ హైదరాబాద్‌కు రావడం పెద్ద న్యూస్‌. అదొక్కటే కాదు టిమ్‌కుక్‌తో కలిసి సీఎం కేసీఆర్‌ హైటెక్‌ సిటీలో ప్రత్యేక యాప్‌ కేంద్రాన్ని ప్రారంభించారు. యాపిల్‌ యాప్స్‌ సంస్థతో హైదరాబాద్‌ ప్రపంచ శ్రేణి ఐటీ నగరంగా మారింది. ఓ దశలో టిమ్‌కుక్‌తో మంత్రి కేటీఆర్‌ సెల్ఫీ దిగారు. తండ్రి కేసీఆర్‌ కూడా ఆ సెల్ఫీలో ఉన్నారు. భాగ్యనగరంలో యాపిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ప్రారంభంకావడమే  బిగ్‌ న్యూస్‌ అని  తేల్చేశారు.   హైదరాబాద్‌ లో యాపిల్‌  డెవలప్‌ మెంట్‌ సెంటర్‌ ప్రారంభం కావడం పట్ల ఐటీ శాఖా మంత్రి  ఆనందంలోమునిగి తేలుతున్నారు.  భారత పర్యటనలో ఉన్న యాపిల్‌ సీఈవో టిమ్‌కుక్‌  గురువారం హైదరాబాద్‌ లోని వేవ్‌ రాక్‌ భవనంలో  టెక్‌ సెంటర్‌ ను ప్రారంభించగా, మంత్రి కేటీర్‌ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం కేటీఆర్‌ సోషల్‌ విూడియాలో తన సంతోషాన్ని పంచుకున్నారు.   ఈ సందర్భంగా తెలంగాణా ముఖ్యమంత్రి, తండ్రి, కేసీఆర్‌ సహా,  టిమ్‌ కుక్‌ తో తీసుకున్న అరుదైన  సెల్ఫీని మంత్రి ట్విట్టర్‌ లో షేర్‌ చేశారు. ఫ్రెంజీ ఔట్‌ సైడ్‌ వేవ్‌ రాక్‌ అంటూ మరికొన్ని ఫోటోలను  పోస్ట్‌ చేశారు. దీంతోపాటు యాపిల్‌  సంస్థ ఎంబ్లమ్‌  ‘యాపిల్‌’ ను తమ పార్టీ  గులాబీ రంగుతో  పూర్తిగా నింపేసి  ఆశ్చర్యంలో ముంచెత్తారు. అమెరికా తరువాత  అతి పెద్ద డెపలప్‌ మెట్‌ సెంటర్‌ కు హైదరాబాద్‌ వేదిక  అయిందని ట్విట్‌  చేశారు. గత  ఏడాది  మేనెలలో గూగుల్‌ వస్తే.. ఇపుడు  యాపిల్‌ హైదరాబాద్‌ కు తరలి వచ్చిందని కమెంట్‌ చేశారు.