ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ : ధోనీ సేన వార్మప్
స్వదేశీ గడ్డపై పర్యాటక ఇంగ్లండ్ జట్టుతో నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆరంభంకానుంది. ఈ సిరీస్‌లో భాగంగా ఈ నెల 15వ తేదీ నుంచి తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఇందుకోసం ధోనీ సేన తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌ను శుక్రవారం ఆడనుంది. మూడు రోజు పాటు ఇక్కడి బ్రాబోర్నే స్టేడియంలో జరిగే మ్యాచ్ కోసం జట్టు కోచ్ డెంకన్ ప్లెచర్, ఇతర జట్టు సభ్యులు కూడా విచ్చేశారు. అయితే నేటి మధ్యాహ్నం ప్రారంభం కానున్న ప్రాక్టీస్ సాయంత్రం కొనసాగనుంది. అలాగే శని, ఆదివారాల్లో కూడా పూర్తి స్థాయిలో ప్రాక్టీస్ చేయనుంది. ఇందుకుగాను తొలి రోజు మొత్తం 10 మంది నెట్ బౌలర్లను ఉపయోగించుకోనుండగా.. ఆ తర్వాతి రెండు రోజుల్లో పూర్తిగా కొనసాగనున్న ప్రాక్టీస్ సెషన్స్‌కు 18 మంది నెట్ బౌలర్లు అందుబాటులో ఉండనున్నారు.