ఇంగ్లాండ్‌ను చిత్తు చేసిన భారత్ హాకీ జట్టు
ఇంగ్లాండ్,డిసెంబర్ 1: ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో భారత జట్టు శుభారంభం చేసింది. తొలి మ్యాచ్‌లో 3-1 తేడాతో పై ఘనవిజయం సాధించింది. మ్యాచ్ ప్రారంభంలో ఇంగ్లాండ్ ఆధిపత్యం కనబరిచింది. 15వ నిమిషంలో ఆ జట్టు ఆటగాడు తమకు లభించిన పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి ఆధిక్యాన్నందించాడు. అయితే మరో 7 నిమిషాల తర్వాత భారత్ ప్లేయర్ డానిష్ మజ్తబా గోల్ సాధించడంతో స్కోర్ సమమైంది. డానిష్ చేసిన గోలే హైలెట్‌గా నిలిచిందని చెప్పాలి. గుర్విందర్‌సింగ్ చాంద్ అందించిన పాస్‌ను డానిష్ అద్భుతంగా గోల్ కొట్టాడు. మొదటి అర్ధభాగం ముగిసేసరికి స్కోర్ 1-1తో సమంగా ఉంది. సెకండాఫ్‌లో దూకుడు పెంచిన టీమిండియా వరుసగా గోల్స్ చేసింది. 38వ నిమిషంలోనే యువరాజ్ వాల్మీకి చాలా దూరం నుండి అద్భుతమైన గోల్ చేయడంతో ఆధిక్యం 2-1కి చేరింది. ర్దార్‌సింగ్ పెనాల్టీ కార్నర్ ద్వారా మరో గోల్ సాధించడంతో భారత్ ఆధిక్యం 3-1కి పెరిగింది. వరుసగా రెండు గోల్స్‌తో విజయానికి చేరువైన భారత్ ఇంగ్లాండ్ డిఫెన్స్‌ను సమర్థంగా అడ్డుకోవడంతో మ్యాచ్ కైవసం చేసుకుంది. పూల్ ఎలో చోటు దక్కించుకున్న భారత్ తర్వాతి మ్యాచ్‌లో ఆదివారం న్యూజిలాండ్‌తో తలపడుతుంది.