ఇంజనీరింగ్ కళాశాలల్లో ఏకీకృత ఫీజు విధానం
అమలు చేయాల్సిందే : ‘సుప్రీం’ ఆదేశం
న్యూఢిల్లీ, ఆగస్టు 1 (జనంసాక్షి): ఇంజనీరింగ్ కళాశాలల్లో ఏకీకృత ఫీజు విధానం మాత్రమే అమలు చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. సుప్రీంకోర్టు తీర్పు వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై భారీగా భారం పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కన్వీనర్ కోటా, యాజమాన్యం కోటా సీట్లకు ఫీజులో తేడాను పాటిస్తూ ఫీజుల విధానానికి అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరిన విషయం తెలిసిందే. సుప్రీం కోర్టు బుధవారంనాటి తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తిని తోసిపుచ్చినట్టయింది. కన్వీనర్, యాజ మాన్య కోటాల సీట్లకు ఒకే విధమైన ఫీజును అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2012-13 విద్యా సంవత్సరం నుంచే ఏకీకృత ఫీజు విధానాన్ని అమలు చేయాలని సూచించింది. ఇదిలా ఉండగా ఇప్పటివరకు కన్వీనర్ కోటా కింద ఏడాదికి 30 వేల రూపాయల ఫీజు ఉంది. అది మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం.