ఇంజినీరింగ్‌ ఫీజులను పెంచితే సహించం

కడప, జూలై 21: ప్రభుత్వం ఇంజినీరింగ్‌ ఫీజులను పెంచాలన్న ఆలోచనను వెంటనే విరమించుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు శంకర్‌ విజ్ఞప్తి చేశారు. ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమాన్యాలు ఇప్పటికే రకరకాల ఫీజుల పేరిట విద్యార్థులను దోచుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. కనీస ప్రమాణాలు పాటించకుండా, క్వాలిఫైడ్‌ ప్రొఫెసర్లను నియమించకుండానే యాజమాన్యాలు కళాశాలలను నడుపుతున్నాయని అన్నారు. ప్రభుత్వం ఫీజులను పెంచితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు.