ఇంటర్మీడియేట్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించండి : అధికారులతో కలెక్టర్ శ్రీహర్ష

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) జూలై 26 : జిల్లాలో ఆగస్టు 1 2022 నుండి 8 2022 వరకు నిర్వహించే సప్లమెంటరీ ఇంటర్మీడియట్ పరిక్షలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బంధిగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ హర్ష సంబంధిత అధికారులకు ఆదేశించారు. మంగళవారం కల్లెక్టరేట్ సమావేశం హలు నందు ఇంటర్మీడియట్ నోడల్ అధికారుల అధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోఆర్డినేషన్ కమిటీ సమావేశం లో మాట్లాడుతూ జిల్ల లో జరిగే సప్లమెంటరీ ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పకడ్బందిగా చేయాలనీ, శాఖల వారిగా చేయాల్సిన పనులను సంబంధిత అధికారులు సమన్వయము తో పూర్తి చేయాలనీ అధికారులకు ఆదేశించారు. జిల్లాలో మొదటి సంవత్సరం జనరల్ విభాగం లో 2327, ఒకేషనల్ విభాగం లో 307 మొత్తం 2634 విద్యార్థులు ఉన్నారని, రెండవ సంవత్సరం, ప్రైవేటు విభాగం లో 1106, మొత్తం 3740 విద్యార్థులు ఉన్నారని, జిల్లా లో పరిక్షల నిర్వహణ కు 10 సెంటర్ లను , ఏర్పాటు చేశామని తెలిపారు. పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్ష కేంద్రాలలో ప్రశ్నా పత్రాలను సి.సి. కెమెరాల పర్యవేక్షణ లో సీల్ తీయాలని, పరీక్షా సమయం లో నిరంతర విద్యుత్ సరపరా ఉండేవిధంగా చూడాలని అన్నారు. పరీక్షా కేంద్రాలను మూడు రోజులు ముందుగానే పూర్తిగా సానిటైజ్ చేయించాలని, సెంటర్ లలో తాగు నీటి వసతి ఏర్పాటు చేయాలని, ప్రతి కేంద్రానికి ఇద్దరు వైద్య సిబ్బంది ని ఏర్పాటు చేయాలనీ వైద్య అధికారులకు ఆదేశించారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలనీ, పరీక్షా కేంద్రాల ఆవరణ లో ఉన్న అన్ని జిరాక్స్ సెంటర్ లను ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పార్ట్ 1, ,మధ్యాహ్నం 2.30 నుండి 5.30 సాయంత్రం వరకు పార్ట్ 2 పరీక్షలు ఉంటాయని, జిరాక్స్ సెంటర్లు అన్ని మూసి ఉంచాలని, పరీక్షా కేంద్రాలకు ప్లైయింగ్ స్క్వాడ్ లను ఏర్పాటు చేసి, పరీక్షల నిర్వహణ పై నిఘా వుంచాలని రెవిన్యూ , అధికారులకు ఆదేశించారు. పరీక్ష సమయానికి విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకునే విధంగా అన్ని మండలాలకు బస్సు సౌకర్యాన్ని అందుబాటులో ఉంచాలని, సింగిల్ బస్సు ఉన్న మండలాలకు బస్సుల సంఖ్య పెంచే విధంగా చూడాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. పరీక్ష నిర్వహణ అనంతరం సమాధానపత్రాలను సీల్ చేసి పోస్టల్ ద్వారా తరలించే ప్రక్రియ పకడ్భందిగా చెపట్టాలని ఆదేశించారు.
సమావేశం లో ఇంటర్మీడియట్ నోడల్ అధికారి హృదయ రాజు, జిల్లా విద్యాధికారి సిరాజ్జుద్ధిన్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.