ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాల్లో బాలికలదే పై చేయి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 26 (జనంసాక్షి) : ఇంటర్మీడియెట్‌ ద్వితీయ సంవత్సరం ఫలితా ల్లోనూ బాలకలదే పై చేయిగా నిలిచింది. మరో సారి కృష్ణా జిల్లా ఫలితాల్లో ముందంజలో ఉండ గా, కరువు జిల్లా మహబూబ్‌నగర్‌ చిట్టచివరన నిలిచింది. ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలను మాధ్యమిక విద్యాశాఖ మంత్రి మంత్రి పార్థసారధి శుక్రవారం నాడిక్కడ విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 65.36 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని మంత్రి తెలిపారు. గత ఏడాది కన్నా ఉత్తీర్ణతా శాతం భారీగా 6.93 శాతం పెరిగిందని మంత్రి తెలిపారు.మార్కులు, గ్రేడుల రూపంలో ఈ ఏడాది ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 65.36 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్‌లో 68 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ ఏడాది కూడా బాలికలు తమ సత్తా చాటారు. ఇందులో కృష్ణా జిల్లా ముందుండగా, పాలమూరు చివరి స్థానంలో ఉంది.బాలికలు 69.04 శాతం, బాలురు 62 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ ఫలితాలలో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో ఉండగా, మహబూబ్‌నగర్‌ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే విద్యార్థులు మెరుగైన ఫలితాలను కనబరిచారని మంత్రి పార్థసారథి అభినందించారు. 2012 లో ఉత్తీర్ణతా శాతం 52.43గా ఉంది. గత ఏడాదితో పోలిస్తే 6.93 శాతం అధిక్యత సాధించినట్లు మంత్రి తెలిపారు. మార్కుల జాబితాను ఏప్రిల్‌ 30 కల్లా ఆయా కాలేజీలకు అందజేయనున్నట్లు తెలిపారు. మే 22 ఇంటర్‌ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. మే 22 ఉదయం ఇంటర్‌ మొదటి సంవత్సరం, మధ్యాహ్నం రెండవ సంవత్సర పరీక్షలు జరుగనున్నాయి. మే 6 సప్లమెంటరీ పరీక్ష ఫీజు చివరి తేదీ అని తెలిపారు. ద్వితీయ సంవత్సర పరీక్షల్లో మొత్తం 9,24,830 మంది విద్యార్థులు హాజరవగా 5,51,169 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. రెగ్యులర్‌ విద్యార్థులు 65.36 శాతం ఉత్తీర్ణత సాధించగా, ప్రైవేట్‌ విద్యార్థులు 30.50శాతం, వొకేషనల్‌ విద్యార్థులు 48.60 శాతం ఉత్తీర్ణత సాధించారు.ఈసారి ఇంటర్‌ ఫలితాల్లో అగ్రస్థానం కృష్ణా జిల్లాకే దక్కింది. మంత్రి పార్థసారధి విడుదల చేసిన ఫలితాల్లో విద్యార్థుల ఉత్తీర్ణతా శాతంలో కృష్ణా జిల్లా 77 ఉత్తీర్ణతా శాతంతో ప్రథమస్థానంలో నిలవగా, మహబూబ్‌నగర్‌ జిల్లా 45 శాతంతో చివరిస్థానంలో నిలిచింది. ఇంటర్‌ ద్వితీయ ఫలితాల్లో ఎంపీసీ గ్రూపులో అత్యధిక ఉత్తీర్ణతా శాతం 75.37 నమోదైంది. హెచ్‌ఈసీ గ్రూపులో అతి తక్కువ ఉత్తీర్ణత 38.31 శాతం నమోదైంది. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసిన అభ్యర్థులకు మార్కుల రీకౌంటింగ్‌, దిద్దిన సమాధాన పత్రాల ఫొటోకాపీ కమ్‌ రీవెరిఫికేషన్‌ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాల కోసం రీకౌంటింగ్‌కి పేపరుకు రూ. 100 చొప్పున, ఆన్సర్‌బుక్‌ రీవెరిఫికేషన్‌, ఫొటోకాపీకోసం రూ. 600 చొప్పున ఈ-సేవ లేదా ఏపీఆన్‌లైన్‌ సెంటర్లలో చెల్లించాలి. ఫీజు చెల్లించి హాల్‌ టికెట్‌ నంబరు ఎంటర్‌ చేస్తే అభ్యర్థి వివరాలన్నీ తెర విూద కన్పిస్తాయి. దరఖాస్తు చేయాలనుకున్న స్జబెక్టు వివరాలను నింపి ప్రింట్‌ తీసుకుని కళాశాల ప్రిన్సిపాల్‌కి అందజేయాలి. ఈ ఫీజు చెల్లింపునకు చివరి తేదీ మే 7గా నిర్ణయించారు. ఈ తేదీని పొడిగించడం కుదరదని, మే 7 తర్వాత ఆన్‌లైన్‌ సేవలను నిలిపివేస్తారు. ఇంటర్‌ సెకండియర్‌ అడ్వాన్స్‌డ్‌ స్లపిమెంటరీ పరీక్షలను మే 22 నుంచి నిర్వహిస్తామని మంత్రి పార్థసారథి వెల్లడించారు. పరీక్ష ఫీజు చెల్లింపునకు ఆఖరి తేదీ మే 6. ఆ తర్వాత అపరాధ రుసుముతో పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం లేదు. పరీక్షలు మధ్యాహ్నం రెండున్నర గంటలనుంచి 5.30 గంటలవరకు నిర్వహిస్తారు. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాల మార్కుల మెమోలను ఏప్రిల్‌ 30 వ తేదీ కల్లా ఆయా కళాశాలలకు పంపించేస్తామని ఇంటర్‌ బోర్డు తెలిపింది. విద్యార్థులు మెమోలను కళాశాలలనుంచి తీసుకోవచ్చని బోర్డు తెలిపింది.ఈ ఏడాది ఇంటర్‌ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు మంచి ఫలితాలు సాధించాయి. మొత్తవ్మిూద 65 శాతం ఉత్తీర్ణత సాధించగా ఆదిలాబాద్‌ జిల్లా ప్రథమస్థానంలో నిలిచింది. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో వొకేషనల్‌ కోర్సులో 65 శాతం ఉత్తీర్ణతా శాతంతో శ్రీకాకుళం జిల్లా ప్రథమస్థానంలో నిలిచింది. 28 శాతం ఉత్తీర్ణతతో మహబూబ్‌నగర్‌ జిల్లా చివరి స్థానంలో నిలిచింది.