బీహార్‌లో మోగిన ఎన్నికల నగారా
` రెండు విడుతల్లో ఎలక్షన్ల నిర్వహణ
` నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్
` నవంబర్ 14న కౌంటింగ్..అదేరోజు ఫలితాలు
` 90 వేల పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు
` ఈవీఎంలపై తొలిసారి అభ్యర్థుల కలర్ ఫొటోలు
` ఓటు వేయనున్న 7.43 కోట్ల మంది ఓటర్లు
` అందులో 3.92 కోట్ల పురుషులు, 3.50 కోట్ల మహిళా ఓటర్లు
` షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
న్యూఢల్లీి (జనంసాక్షి) :బిహార్ శాసనసభ ఎన్నికలకు నగారా మోగింది. రెండు విడతల్లో పోలింగ్ నిర్వహిస్తారు. నవంబర్ 6, నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్ట నున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ఈ మేరకు షెడ్యూల్ ఖరారు చేసింది. పోలింగ్ తేదీలు, ఇతర వివరాలను కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ సోమవారం విూడియా సమావేశంలో వివరాలు వెల్లడిరచారు. బిహార్ లో మొత్తం 243 శాసనసభ స్థానాలున్నాయి. ప్రస్తుత అసెంబ్లీ గడువు వచ్చే నెల చివరి వారంతో ముగియనుంది. బిహార్‌లో నిర్వహించిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్‌ఐఆర్‌పై జ్ఞానేశ్ కుమార్ స్పందించారు ఎస్‌ఐఆర్ ముసాయిదాను ఆగస్టు ఒకటిన విడుదల చేశాం. దానిని అన్ని రాజకీయ పార్టీలకు అందజేశాం. అభ్యంతరాలు ఉంటే వ్యక్తం చేసే అవకాశం ఇచ్చాం. తుది జాబితాను సెప్టెంబర్ 30న ప్రకటించాం. ఇప్పటికీ అభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తాం అని తెలిపారు. ఈ ఎన్నికలను ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పారదర్శకంగా నిర్వహిస్తామని జ్ఞానేశ్ చెప్పారు. 90 వేల పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామన్నారు. 7.43 కోట్ల మంది ఓటు వేయనున్నారని, వారిలో 3.92 కోట్ల మంది పురుషులు, 3.50 కోట్ల మహిళా ఓటర్లు ఉన్నారని చెప్పారు. రద్దీ నిర్వహణ కోసం ఒక్కో బూత్‌లో 1200 మంది ఓటు వేసేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈవీఎంలపై తొలిసారి అభ్యర్థుల కలర్ ఫొటోలు వేసే పక్రియను ఈ ఎన్నికలతోనే ప్రారంభిస్తున్నామని తెలిపారు. రెండు దశల్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. నవంబర్ 22లోపు ఎన్నికల పక్రియ పూర్తి చేస్తామని సీఈసీ చెప్పింది. ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని, ఆగస్టు 1న ఓటర్ల తుది జాబితా ప్రకటించామని సీఈసీ సభ్యులు తెలిపారు. బిహార్‌లో మొత్తం 7.42 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, ఓటర్ల జాబితాలో సవరణలకు ఇంకా అవకాశం ఉందని కూడా సీఈసీ తెలిపింది. నామినేషన్లకు 10 రోజుల ముందు కూడా.. ఓటరు జాబితాలో మార్పులు చేసుకోవచ్చని సూచించింది. ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని,ఈసారి ఎన్నికల పక్రియ మరింత సులభతరం చేస్తున్నామని సీఈసీ వెల్లడిరచింది. బిహార్ ఎన్నికల కోసం 90,712 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి పోలింగ్ స్టేషన్‌లోనూ వెబ్‌క్యాస్టింగ్ ఉంటుందని సీఈసీ స్పష్టం చేసింది. బీహార్ మొదటి విడత ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ అక్టోబర్ 10న వస్తుంది. నామినేషన్ల దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 17. నామినేషన్ ఉపసంహరణ గడువు అక్టోబర్ 20తో ముగుస్తుంది. నవంబర్ 6 తేదీన మొదటి విడత ఎన్నికలు జరుగుతాయి. ఇక, రెండో విడత ఎన్నికలకు గెజిట్ నోటిఫికేషన్ అక్టోబర్ 13న విడుదల చేస్తారు. నామినేషన్ల దరఖాస్తుకు అక్టోబర్ 20 చివరి తేదీ. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 23 వరకూ అవకాశం ఉంటుంది. తుది దశ ఎన్నికల పోలింగ్ నవంబర్ 11న జరుగుతుంది. నవంబర్14న కౌంటింగ్ చేపట్టి అదేరోజు ఎన్నికల ఫలితాలు విడుదల చేస్తారు. వృద్దులు, దివ్యాంగ ఓటర్లకు ఇంటి దగ్గరే ఓటింగ్ అవకాశం కల్పిస్తున్నామని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఎలాంటి ఫిర్యాదుకైనా 1950 నెంబర్‌కు ఫోన్ చేసే అవకాశం ఉంటుందని, సోషల్ విూడియాలో తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల సంఘం హెచ్చరించింది. బిహార్ ఎన్నికల నుంచి కొత్తగా 17 సంస్కరణలు తీసుకొస్తున్నామని కూడా చెప్పింది. ఈ సంస్కరణలను భవిష్యత్‌లో దేశవ్యాప్తంగా అమలుచేస్తామంది. బిహార్‌లో మొత్తం 7.42 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, వీరిలో 14 లక్షల మంది కొత్త ఓటర్లని సీఈసీ చెప్పింది. ఇక నుంచి ఇªపఓలపై అభ్యర్థుల కలర్ ఫొటోలు ఉంటాయని ఎన్నికల సంథం తెలిపింది. ప్రస్తుతం బిహార్‌లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉంది. 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యం లభించలేదు. దీంతో జేడీయూ, భాజపా కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. నీతీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కానీ, రెండేళ్లకే నీతీశ్ ఎన్డీయేను వీడి.. ఆర్జేడీ, కాంగ్రెస్‌తో మహాగఠ్‌బంధన్‌లో చేరి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే, ఈ బంధమూ ఎంతోకాలం నిలవలేదు. 2024 జనవరిలో మహా కూటమిని వీడిన జేడీయూ మళ్లీ ఎన్డీయేతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో మరోసారి నీతీశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు..
ఏడు రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 8 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 11న ఉప ఎన్నికలు జరగనున్నాయి. రాజస్థాన్‌లోని అంతా, రaార?ండ్‌లోని ఘట్‌శిలా, తెలంగాణలోని జూబ్లీహిల్స్, పంజాబ్‌లోని తర్న్‌తారన్, మిజోరంలోని దంపా, ఒడిశాలోని నౌపాఢాతోపాటు జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలోని బడ్గామ్, నగ్రోటా స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయని ఈసీ వెల్లడిరచింది.
బీహార్‌లో అన్ని స్థానాల్లో ‘ఆప్’ పోటీ
` 11 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల
న్యూఢల్లీి(జనంసాక్షి) :అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో బిహార్‌లో రాజకీయాలు మరింత జోరందుకున్నాయి. రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో (243) పోటీ చేయనున్నట్లు ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ ప్రకటించింది. 11 మంది అభ్యర్థులతో తొలి జాబితాను కూడా విడుదల చేసింది. ఇప్పటికే జాతీయ పార్టీగా గుర్తింపు పొందిన ‘ఆప్’.. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనుండటం ఇదే తొలిసారి.దిల్లీ, పంజాబ్‌లో అనుసరించిన పాలనా విధానాలను బిహార్‌లోనూ అమలు చేస్తామని పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి అజేశ్ యాదవ్ తెలిపారు. ‘‘అభివృద్ధి, పాలనకు సంబంధించి మా దగ్గర విజయవంతమైన నమూనా ఉంది. ప్రజా సంక్షేమం విషయంలో ఆప్ చేసిన పనులు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. గతంలో దిల్లీలో ఆప్ ప్రభుత్వ ఏర్పాటుకు పూర్వాంచల్ ప్రాంత ప్రజలు సహకరించారు. ఇప్పుడు బిహార్‌లోనూ అండగా నిలుస్తారని ఆశిస్తున్నామని పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విశ్వాసం వ్యక్తం చేశారు’’ అని అజేశ్ పేర్కొన్నారు. బిహార్ ఎన్నికల్లో ఇతర పార్టీలతో జట్టుకట్టే అంశాన్ని ఆప్ రాష్ట్ర సహాయక ఇన్‌ఛార్జి అభినవ్ రాయ్ తోసిపుచ్చారు. ప్రజలతోనే తమకు పొత్తు ఉందని పేర్కొన్నారు. ఇతర పార్టీలు, కూటములతో కలసి పోటీ చేసే అవకాశం లేదని స్పష్టం చేశారు. జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ ఇప్పుడిప్పుడే సంస్కరణల గురించి మాట్లాడటం ప్రారంభించారని, వాటిని తాము ఇప్పటికే క్షేత్రస్థాయిలో అమలు చేశామన్నారు. బిహార్‌లో రెండు విడతల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 6, నవంబర్ 11న ఓటింగ్ ప్రక్రియ జరగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ ఎన్నికలను ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పారదర్శకంగా నిర్వహిస్తామని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 90 వేల పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని, 7.43 కోట్ల మంది ఓటు వేయనున్నారని చెప్పారు. ఓటర్లలో 3.92 కోట్ల మంది పురుషులు, 3.50 కోట్ల మహిళా ఓటర్లు ఉన్నారు.