ఇంటర్ పరీక్ష ఫలితాల్లో ఎల్లారెడ్డి మోడల్ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ
ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని టి ఎస్ మోడల్ స్కూల్, జూనియర్ కళాశాల విద్యార్థుల ఫలితాలు మంగళవారం వెలువడిన ఇంటర్ పరీక్ష ఫలితాల్లో పలువురు ఉత్తమ ప్రతిభ కనబరిచారు ఈ మేరకు కళాశాల ప్రిన్సిపల్ సాయిబాబా ఫలితాలకు సంబంధించి ఒక ప్రకటన విడుదల చేశారు ఇంటర్ ఫస్టియర్లో మొత్తం 142 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 84 మంది 59% శాతంతో పాసయ్యారని ఆయన తెలిపారు ఎంపీసీ లో చందన 461 అత్యధిక మార్కులు సాధించగా, బైపీసీలో నాగజ్యోతి 426, శిరీష 437, ఎంఈసీ లో అశోక్ 466 మార్కులు సాధించారు అలాగే సెకండియర్లో 125 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 85 మంది 68 శాతం తో పాస్ అయ్యారు అని ఆయన పేర్కొన్నారు. ఎంపిసిలో శ్రీకాంత్ 928 అత్యధిక మార్కులు సాధించిగా, బైపీసీలో సనా నజీన్ 962, సీఈసీ లో తనీజ్ తరిన్ 792 మార్కులు సాధించారని ఆయన తెలిపారు. ఈ మేరకు ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జూనియర్ కళాశాల అధ్యాపకులు అభినందించారు.