ఇంటర్ బాలికలకు ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణి

బాలికల హక్కులపై అవగాహణ అవసరం
నిర్మల్ బ్యూరో, అక్టోబర్11,,    అన్ని రంగాల్లో బాలికలు రాణించాలని గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ నీరడి గంగాశంకర్, ప్రధానవక్త ,ఉపన్యాసకులు, పద్యకవి బి. వెంకట్ లు పేర్కొన్నారు.తెలంగాణరాష్ట్ర గురుకుల బాలికల విద్యాలయము,జూనియర్ కళాశాలలో మంగళవారం అంతర్జాతీయ బాలికా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడారు.అంతర్జాతీయ బాలికా దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబరు 11న నిర్వహించబడుతోందని, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను, అనర్థాలను నివారించి, వారి హక్కులను తెలియజేసేందుకు ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవాన్ని ప్రకటించిందని అమెరికన్ పౌరహక్కుల కార్యకర్త ఎలానార్‌ రూజ్‌వెల్ట్‌, 192 దేశాలు సంతకం చేసిన మానవ హక్కుల ప్రకటనలో స్ర్తీ, పురుష సమానత్వాన్ని ప్రతిబింబించేలా మ్యాన్‌ అన్న పదాన్ని పీపుల్‌గా మార్చిందని, మహిళల ఆత్మగౌరవం కాపాడడం కోసం పోరాటం చేసిన ఎలానార్‌ రూజ్‌వెల్ట్‌ పుట్టిన రోజైన అక్టోబరు 11ను అంతర్జాతీయ బాలికా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి గుర్తించిందని అన్నారు.2012, అక్టోబరు 11న తొలిసారిగా ఈ దినోత్సవం జరుపబడిందని, ప్రపంచవ్యాప్తంగా బాలికలు ఎదుర్కొంటున్న లింగ అసమానతలు విద్య, పోషణ, చట్టపరమైన హక్కులు, వైద్య సంరక్షణ, రక్షణ, హింస, బలవంతపు బాల్య వివాహంపై, వివక్షతపై అవగాహన పెంచడం ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశ్యమని బాలికలు, యువతులు వారివారి రంగాలలో ప్రచారం, పరిశోధనలకు సంబంధించి సాధించిన అభివృద్ధిని ప్రతిబింబించేలా ఈ దినోత్సవ వేడుకలు జరుపుతున్నారని అన్నారు
ప్రపంచవ్యాప్తంగా 62 మిలియన్లకు పైగా బాలికలకు విద్య అందడంలేదని, ప్రపంచవ్యాప్తంగా 5 నుండి 14 సంవత్సరాల వయస్సు గల బాలికలు, అదే వయస్సు గల అబ్బాయిల కంటే 160 మిలియన్ గంటలకుపైగా ఇంటి పనుల కోసం తమ సమయాన్ని కేటాయిస్తున్నారని అన్నారు.2011, డిసెంబరు 19న జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో 2012, అక్టోబరు 11న తొలి అంతర్జాతీయ బాలికా దినోత్సవంగా ఆమోదించే తీర్మానానికి ఓట్లు ,వేయగా, అధికారికంగా బాలికా దినోత్సవం గుర్తించబడిందని అన్నారు.బాలికలు వారి హక్కులపై అవగాహణ కల్పించుకోవాలని అన్నారు.ఇంటర్ ప్రథమ సంవత్సర విద్యార్థినులకు పాఠ్య పుస్తకాల పంపిణి చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ఇంటర్మీడియెట్ బోర్డు నుండి వచ్చిన సంస్కృతం ,తెలుగు, ఆంగ్లము ,గణితము , వృక్షశాస్త్రము ,జీవశాస్త్రము, భౌతిక శాస్త్రము ,రసాయన శాస్త్రము ఉచిత పాఠ్య పుస్తకాలను ప్రథమ సంవత్సరము 70 మంది విద్యార్థినులకు అందజేశారు .*గ్రంథాలయము సహాయకులు కుమ్మరి ఓదేలు ,సాంకేతిక నిపుణులు సంతోశ్ ,కళాశాల కో ఆర్డినేటర్ వీణారాణి, విద్యాలయము సహాయ ప్రధానోపాధ్యాయురాలు మేరిమార్గరేట్ ,ఉప సంక్షేమ అధికారిణి కల్పన ,కళాశాల ఉపన్యాసకులు -వేణుగోపాల్, మనీష ,దీపక్ ,ప్రభాకర్, బ్యూలారాణి ,విద్యార్థినులు, తదితరులు పాల్గొన్నారు .*