ఇంటింటికి జాతీయ జెండాలను పంపిణీ.
నేరేడుచర్ల జనంసాక్షి న్యూస్. భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా,ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు,ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయలని నినాదంతో నేరేడుచర్ల టౌన్ బిజెపి నాయకులకు,శక్తి కేంద్ర ఇన్చార్జీలకు,బూత్ అధ్యక్షులకు, కార్యకర్తలకు పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాల పంపిణీ చేశారు.ఈ సందర్భంగా టౌన్ అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్య్రం సాధించి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా కుల,మత, వర్గ,రాజకీయ భేదాలు లేకుండా అందరం “జాతీయ జెండా” ను మన ఇంటిపై మరియు మన సామాజిక మాధ్యమాల ఖాతా డిస్ప్లే పిక్చర్ గా ఉంచి దేశ సమగ్రతను, దేశ ఏకత్వాన్ని సూచిద్దామని కోరారు.ఈ కార్యక్రమంలో,ఉపాధ్యక్షులు ఉరిమల్ల రామ్మూర్తి,కడారి ఎల్లయ్య, ప్రధాన కార్యదర్శి కొణతం నాగిరెడ్డి, కార్యదర్శి రాజేష్ రెడ్డి, కిసాన్ మోర్చా అధ్యక్షులు తాళ్ల నరేందర్ రెడ్డి, కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి తాటికొండ పరమేష్ రెడ్డి,యువ మోర్చా అధ్యక్షులు మాడిశెట్టి ప్రతాప్ గుప్తా, బూతు అధ్యక్షులు నాగరాజు,యడవెల్లి సైదిరెడ్డి మరియు కార్యకర్తలు ముదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రావిరాల నరేష్, మండల బిజెపి నాయకులు లక్ష్మణ్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.