ఇంటింటికీ ఇంటర్‌నెట్
– మంత్రి కేటీఆర్ సమీక్ష
తెలంగాణ పైబర్ గ్రిడ్ పథకం పైన ఐటి శాఖ మంత్రి కె.తారక రామారావు సవిూక్ష
ఇంటింటికి ఇంటర్నెట్ కోసం ఉద్దేశించిన తెలంగాణ పైబర్ గ్రిడ్ పథకం పైన ఐటి శాఖ మంత్రి కె.తారక రామారావు సవిూక్ష నిర్వహించారు. సచివాలయంలో జరిగిన ఈ
సమావేశంలో అర్ డబ్యూయస్, ఐటిశాఖాధికారులు పాల్గోన్నారు. ఇప్పటికే మిషన్ భగీరథ కార్యక్రమం వేగంగా నడుస్తున్నట్లు మంత్రికి అర్ డబ్యూయస్ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకి సూమారు 3500 వేల కీలోవిూటర్ల పైపు లైన్లు వేసినట్లు తెలిపారు. అయితే మిగిలిన చోట్ల పైపులైన్లతోపాటు పైబర్ డక్ట్ ని వేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకి డక్ట్ కోసం టెండర్ల ప్రక్రియ పూర్తి చేసినట్లు తెలిపారు. ఇప్పటికే దుబ్బకా సెగ్మెంగ్లో పైపులైన్లతో వేయాల్సిన పైబర్ డక్ట్ ప్రొక్యూర్ మెంట్ అయిపోందన్నారు. ఈ సమన్వయ సమావేశంలో
ఇప్పటి నుండి ఏక్కడ పైపు లైన్ వేస్తే అక్కడ పైబర్ వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు, ఈ మేరకి డక్ట్ సరఫరాకి పూర్తి ఏర్పాట్లు పూర్తి అయినట్లు మంత్రి కెటియార్ తెలిపారు. మెత్తం ప్రాజెక్టు వేగంగా నడుస్తున్నందున పైబర్ గ్రిడ్ పనులు సైతం ఇకపై వేగంగా నడుస్తాయన్నారు. ఇప్పటికే పైపు లైన్లు వేయడం పూర్తయిన మెట్రో సెగ్మెంట్లో ఏరియల్ కేబులింగ్ ద్వారా పైబర్ గ్రిడ్‌ని పూర్తి చేస్తామన్నారు. పైబర్ గ్రిడ్ ప్రాజెక్టుకి భారత్ నెట్ ద్వారా కేంద్రం నుంచి రావాల్సిన నిధుల సహయంపైన రేపు ఐటి శాఖ కార్యదర్శి కేంద్ర ప్రభుత్వ టెలికామ్ శాఖాధికారులతో సమావేశం అవుతారన్నారు. అయితే మెత్తం పైబర్ గ్రిడ్ లో ఏన్ని కిలోవిూటర్ల మేరకు ఏరియల్, ఏంత మేరకి అండర్ గ్రౌండ్ కేబుల్ వేయనున్నామో పూర్తి వివరాలతో సిద్దంగా ఉండాలన్నారు. పైబర్ గ్రిడ్ పనులతో పాటు మిషన్ భగీరథ పనులు జరుగుతున్న తీరుని మంత్రి కె.టి రామారావు అర్ డబ్యూయస్ శాఖాధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా గ్రామాల్లోని అంతర్గత పైపులైన్ల నిర్మాణం తాలుకు జరుగుతున్న పనులను అధికారులు వివరించారు. గ్రామాల్లోని అంతర్గత పైపులైన్ల నిర్మానంలో నాణ్యత ఉండేలా ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని లేకుంటే ప్రాజెక్టు ఉద్దేశ్యం అయిన ఇంటింటి నల్లతో మంచి నీరనే నినాదం పైన ప్రభావం పడుతుందన్నారు. ఈ సమావేశంలో పంచాయితీరాజ్ స్పేషల్ చీప్ సెక్రటరీ యస్ పి సింగ్, ఐటి శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, అర్ డబ్యూయస్ ఈ యన్ సి సురేందర్ రెడ్డిలతో పాటు ఐటి , అర్ డబ్యూయస్ అధికారులు ఉన్నారు.