ఇంటిదొంగలపై కన్నేసిన అధికారులు
ఇక కఠినంగా వ్యవహరించనున్నట్లు సమాచారం
నిజామాబాద్,జనవరి28(జనంసాక్షి): కలప స్మగ్లింగ్‌లో ఇంటి దొంగల వ్యవహారంపై అటవీ,పోలీస్ శాఖలు దృష్టి సారించాయి. కటిన చర్యలకు ఉపక్రమించాయి. అంతర్గత సమావేశాలతో హెచ్చరికులచేస్తున్నారు. అక్రమాలు మెల్లగా వెలుగులోకి వస్తున్న క్రమంలో పోలీసు, అటవీశాఖల ఉన్నతాధికారులు తమ ఉద్యోగులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి వ్యవహారాలను ఉపేక్షించమని, వాటి జోలికి వెళితే ముఖాలు చూసే పరిస్థితి ఉండదంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా అక్రమ వ్యాపారాలపై సమాచారం ఉంటే తెలపాలని హెచ్చరిస్తున్నట్లు సమాచారం. విధులను సక్రమంగా నిర్వర్తించాలని సూచిస్తున్నట్లు తెలుస్తోంది.వరుస ఎన్నికల నేపథ్యంలో బీజీగా ఉంటున్న అధికారులు కలప అక్రమ దందా వ్యవహారం కేసు విచారణపై దృష్టి పెట్టలేకపోతున్నారని తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల విధుల్లో ఉండటం వల్ల కొంత సమయం యించలేకపోతున్నట్లు చెబుతున్నారు. ఎన్నికల విధులు ముగిశాక పూర్తిస్థాయిలో దృష్టి పెడతారిని అంతర్గంతంగా చెబుతున్నారు. కలప అక్రమ రవాణా కట్టడికి వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించిన నేపథ్యంలో నిజామాబాద్ కలెక్టర్ ఎంఆర్‌ఎం నిజామాబాద్ పోలీసు కమిషనర్ కార్తికేయ, డీఎఫ్‌వో ప్రసాద్‌తో సవిూక్ష నిర్వహించారు. జిల్లాలో చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, సాగుతున్న విచారణ విషయాలను డీఎఫ్‌వో ప్రసాద్ కలెక్టర్‌కు వివరించారు. జిల్లాలో ఉండాల్సిన స్థాయిలో చెక్‌పోస్టులే లేవని, గోదావారి దాటిన కలప సులువుగా రవాణా చేసే అవకాశం ఉన్నట్లు చర్చించిన అధికారులు, చెక్‌పోస్టుల సంఖ్యను పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమాలోచనలు చేసినట్లు సమాచారం. అటవీశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం సవిూక్షించారు. ఈ సందర్భంలో కలప అక్రమ వ్యాపారాన్ని కట్టడి చేయాలని, స్మగ్లర్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అయితే దొంగలేవిూ చెక్‌పోస్టుల్లో ఉండే సిబ్బంది కళ్లుగప్పేవిూ తీసుకెళ్లడం లేదు. అక్కడున్న కొందరి సహకారంతోనే దుంగలను తరలిస్తున్నారు. అంటే అడవులను సంరక్షించాల్సిన వారే భక్షకులుగా మారారు. స్మగ్లర్ల విషయంలో కఠినంగా వ్యవహరించడంలో ఇంతకాలం ఇంటి దొంగలను ఉపేక్షించారన్న విమర్శలు ఉన్నాయి. కేసులో ఇరుక్కున్న వారిని ఇంతకాలం ఉపేక్షించిన వారి వ్యవహారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.