ఇంటి నిర్మాణం కొరకు మున్సిపాలిటీ లో దరఖాస్తు చేసుకోండి
అనుమతి లేకుండా నిర్మాణం చేస్తే కఠిన చర్యలు
మున్సిపల్ కమిషనర్ చీక్యాల రత్నకర్ రావు
ఖానాపూర్ రూరల్ 21 అక్టోబర్ (జనం సాక్షి): నూతనంగా ఇంటి నిర్మాణం చేసుకొనే ఇంటి యజమానులు ఖానాపూర్ మున్సిపల్ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ఖానాపూర్ మున్సిపల్ కమిషనర్ చీక్యాల రత్నకర్ రావు అన్నారు.ఈ సందర్భంగా జనం సాక్షి తో మాట్లాడుతూ ఖానాపూర్ మున్సిపాలిటీ అనుమతి లేకుండా ఇంటి నిర్మాణం చేపట్టితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. గత మూడు సంవత్సరాలు గా పెండింగ్ లో ఉన్న ఇంటి టెక్సు లు,ఖానాపూర్ మున్సిపాలిటీ లోని వివిధ దుకాణాల యొక్క యజమానులు అనుమతులు తీసుకోవాలి టెక్సులు కట్టాలని ఇంటి యజమానులు ఇంటి నెంబర్లు తీసుకోవాలని ఖానాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధి కి సహకరించాలి అని ఆయన అన్నారు.