ఇంటి ముందు కూర్చుంటే .. ‘కారు’ చంపేసింది


కొత్త‌గూడ‌: వరంగల్ జిల్లాలొ దారుణం జరిగింది…పండగరోజున ఓ కుటుంబం తమ ఇంటి ముందు కూర్చొని ముచ్చటిస్తుండగా వారిమీద నుంచి   తవేరా వాహనం దూసుకెళ్లింది. ఈ  ప్ర‌మాదంలో ఒక మహిళ మృతి చెందగా మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. వరంగల్ జిల్లా కొత్తగూడకు  చెందిన పోతుగంటి లక్ష్మయ్య ఇంటికి.. పండుగ రోజు కావడంతొ బందువులు వచ్చారు. సాయంత్రం ఇంటి ముందు కూర్చొని అంతా మాట్లాడుకుంటున్న సమయంలొ తవేరా వాహనం వారిపై నుంచి దూసుకెల్లింది. ఈ ఘ‌టనలొ పోతుగంటి పుష్పలత  మృతి చెంద‌గా.. ఆమె కుమార్తె భవానీ, మనువడు, మనవరాలికి తీవ్రగాయాలయ్యాయి. క్ష‌తగాత్రుల‌ను నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రధమ చికిత్సచేయించారు. పరిస్థితి విషమంగా ఉండడంతొ  అక్క‌డి నుంచి వరంగల్  ఎంజీఎంకు తరలించారు.