ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జూలపల్లి లో ఉచిత వైద్య శిబిరం

జనంసాక్షి , కమాన్ పూర్ : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పెద్దపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో మొబైల్ మెడికల్ యూనిట్ ద్వారా వృద్ధులకు ఉచిత సంచార వాహన వైద్య సేవలను మంగళవారం పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం జూలపల్లి గ్రామపంచాయతీ ఆవరణలో నిర్వహించారు. గ్రామ సర్పంచ్ బొల్లపల్లి శంకర్ గౌడ్ ఈ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటిస్, సీనియర్ సిటిజన్స్, భారత ప్రభుత్వ సహాకారంతో వృద్ధులకు వికలాంగులకు ట్రాన్స్ జెండర్స్ సేవలందించేందుకు రెడ్ క్రాస్ సంచార వాహన వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంచార వాహనం ద్వారా వయో వృద్ధులకు బిపి., షుగర్ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించటం జరిగింది జూలపల్లి గ్రామపంచాయతీ ఆవరణలో జరిగిన వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు డాక్టర్ మేఘన ఎమ్మెస్ ఆర్తో, డాక్టర్ సంగీత డాక్టర్ రాజమల్లు డాక్టర్ అశోక్ గారలు వైద్య పరీక్షలు, రక్త పరీక్షలు చేసి ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ కావేటి రాజగోపాల్, వైస్ చైర్మన్ తూము రవీందర్,
కంకటి శ్రీనివాస్ జేఎన్టీయూ ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ దుర్గారావు సూపరిండెంట్ ఉప సర్పంచ్ సభ్యులు ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు.