ఇంద్రవెళ్లి వీరులకు నెత్తుటి సలాం
– హక్కుల కోసం పోరాడిన అరమ వీరులకు ఘన నివాళి
– స్వేచ్చయుత వాతవారణంలో సంస్మరణ దినోత్సవం
– కొనసాగిన 144 సెక్షన్
ఇంద్రవెల్లి / ఆదిలాబాద్, ఏప్రిల్ 20(జనం సాక్షి): అడవి బిడ్డల హక్కుల కోసం 1981 ఏప్రిల్ 20న ప్రభుత్వంతో పోరాడి ప్రాణాలు కొల్పోయిన అమర వీరులకు ప్రతి ఏటా ఏప్రిల్ 20న నివాళు అర్పించడం కొనసాగుతునే ఉంది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇంద్రవెల్లి ఘటనకు 37 ఏళ్లు పూర్తైన సందర్భంగా పలువురు గిరిజనులు, ఆదివాసీలు, ప్రజాప్రతినిధులు శుక్రవారం ఇంద్రవెల్లి మండల శివారులో ఉన్న అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. గత సంవత్సరం ఇదే రోజు స్థూపం వద్ద అమరులకు నివాళులు అర్పించేందుకు అంక్షాలు ఏర్పాడ్డాయి. కానీ ఈ ఏడాది మాత్రం ఆదివాసీ అమరులకు నివాళులు అర్పించేందుకు పోలీసులు అనుమతులు ఇవ్వడంతో ఆదివాసీ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత 37 ఏళ్లలో జరగాని విధంగా శుక్రవారం అమర వీరుల సంస్మరణ దినోత్సవం దినోత్సవం నిర్వహించారు. స్థూపానికి ప్రత్యేక పూజలు చేశారు. ఆదివాసులు సంప్రదాయ బద్దంగా పూజలు చేసి జెండాలను ఆవిష్కరించారు. అమరుల ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపు నిచ్చారు. ఆదివాసులకు స్వేచ్చయుత వాతవారణం కల్పించడంతో ఎలాంటి అవంఛనీయ సంఘటనలు చోటు చేసుకొకుండా ముందస్తు పోలీసు బందోబస్తుతో పాటు 144 సెక్షన్‌ను విధించారు. ఆదిలాబాద్ ఎంపీ నగేష్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోశ లక్ష్మీ, ఐటీడీఏ చైర్మన్ కనక లక్కెరావ్, మేస్రం దుర్గు, శంభు, అమరవీరుల ఆశయ సాధన కమిటి వ్యవస్థాపకుడు ఆతం భుజంగ్‌రావ్, జువాజీ రావు, వెడ్మ బోజ్జు, ఆసిఫాబాద్ కుమ్రం భీం జిల్లా గ్రంధాలయ చైర్మన్ కనక యాదవ్ రావ్, తుకారం, తదితరులు అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి వారి త్యాగాలను స్మరించుకున్నారు. వారిని ఆదర్శంగా తీసుకోని ఆదివాసీలు ముందుక సాగాలని ఆదివాసీ సంఘాల నాయకులు పిలుపు నిచ్చారు. ఇదిలా ఉంటే వచ్చే ఏడాది సంస్మరణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు సీఎం కేసీఆర్‌తో అనుమతి తీసుకుంటామని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ హామీ ఇచ్చారు. జిల్లా ఆదివాసీ మనోభావాలను తెలంగాణ ప్రభుత్వం గౌర