31 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు..
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన 70 మంది ఎమ్మెల్యేల్లో 31 మందిపై క్రిమినల్ కేసులు నమోదు అయినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్(ADR) రిపోర్టు వెల్లడించింది. దిల్లీ ఎన్నికల్లో పోటీ చేసిన 699 మంది అఫిడవిట్లను పరిశీలించి జాబితాను రూపొందించింది.ఈ కేటగిరీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. ఈ పార్టీ తరఫున గెలిచిన 15 మంది ఎమ్మెల్యేలపై నేరచరిత్ర ఉంది .అంటే గెలిచిన మొత్తం ఎమ్మెల్యేల్లో ఇది 68 శాతం. ఇక బీజేపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల్లో 16 మందిపై క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. మొత్తం గెలిచిన ఎమ్మెల్యేల్లో ఇది 33 శాతంగా ఉంది. అయితే 2020లో గెలిచిన వారిలో 43 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. గతంతో పోల్చితే ఈసారి నేరచరిత్ర కలిగిన వారి సంఖ్య తక్కువగా ఉంది.