ఇతర రాష్టాల్రకు ఆదర్శంగా తెలంగాణ
అభివృద్ధి జీర్ణించుకోలేకే విమర్శలు: ఎమ్మెల్యే
వరంగల్,డిసెంబర్9(జనంసాక్షి): ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వెనుకబాటు, వివక్షతకు గురైందని, స్వరాష్ట్రం సాధించుకున్నాకనే సిఎం కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణను అగ్రరాష్ట్రంగా తీర్చిదిద్దేలా కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ చెప్పారు. దీనిని జీర్ణించుకోలేని కాంగ్రెస్,టిడిపిల నేతలు విమర్శలు చేస్తున్నారని అన్నారు. దేశమంతా తెలంగాణ వైపు చూస్తుందని, మిగతా రాష్టాల్ర సీఎం లంతా సీఎం కేసీఆర్ పాలనను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారని తెలిపారు. వివిధ రాష్టాల్ర మంత్రుల బృందాలు తెలంగాణ పర్యటించడమే అందుకు ఉదాహరణ అని అన్నారు. మిషన్ కాకతీయ చరిత్రకు గీటురాయి అని ,మిషన్ భగీరథ నూతన చరిత్ర అని అభివర్ణించారు. పదేళ్లపాటు పాలన చేసిన వారు చేయని పనులను రెందేళ్లలో సిఎం కెసిఆర్ చేసి చూపారని అన్నారు. విద్య, వైద్యం, పరిపాలన, సంక్షేమ పథకాల తీరు మరే రాష్ట్రంలో లేని విధంగా అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే వివరించారు. నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలు లబ్ధిపొందే విధంగా సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవు తున్నాయన్నారు. ఆదివాసీలు ఉమ్మడి రాష్ట్రంలో అన్ని విధాలుగా నష్ట పోయారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అభివృద్ధికి నోచుకుంటున్నారని చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాలు మొన్నటి వరకు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొవలన్ని రహదారుగా ఏర్పడుతు న్నాయన్నారు. ప్రతి మారుమూల పల్లెకు కూడా రహదారులు నిర్మిస్తున్నామని తెలిపారు. అన్ని రాష్టాల్రు
తెలంగాణ వైపు చూస్తున్నాయని, సంక్షేమ పథకాల పట్ల ఆరా తీస్తున్నాయన్నారు. ఓ పక్క ఉనికి కోసం విమర్శలు చేస్తున్నా కేసీఆర్ పని తీరుపట్ల హార్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఎన్ని కుట్రలు, అంబండాలు ప్రభుత్వంపై మోపినా ప్రజల మద్దతు కేసీ ఆర్‌కే ఉంటుందని అన్నారు. తెలంగాణలో విపక్షాల అడ్రస్ గల్లంతేనని తెలిపారు. ప్రజల్లో ఉనికి కోసం విపక్షాలు అర్ధంలేని ఆరోపణలు చేస్తున్నాయని దుయ్యబట్టారు.