ఇది అగ్ని పరీక్ష

2

కడిగిన ముత్యంలా బయటపడతా..రాజయ్య

వరంగల్‌,ఫిబ్రవరి9(జనంసాక్షి): తనకిది అగ్ని పరీక్ష అని, తాను కడిగిన ముత్యాంలా  బయటకు వస్తానని ఉద్వాసనకు గురైన తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య అన్నారు. బంగారు తెలంగాణ కోసం పాటుపడతానని, కేసీఆర్‌ నాయకత్వంలోనే పనిచేస్తానని ఆయన చెప్పారు. ఈమేరకు ఆయన స్టేషన్‌ ఘనాపూర్‌లో విూడియాతో మాట్లాడారు. కొద్ది రోజుల క్రితం తనపై వచ్చిన ఆరోపణలతో తాను ఎంతో మనస్థాపానికి గురయ్యానని పేర్కొన్నారు. దళితుల చైతన్యం కోసం, దళితుల సంక్షేమం కోసం ఓ క్రమశిక్షణ గల కార్యకర్తగా పార్టీలో పనిచేస్తాని తెలిపారు. దళితుల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు. దళితులు ముఖ్యంగా మాదిగలు తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించారని అన్నారు. వారి సంక్షేమం కోసం పనిచేస్తానని అన్నారు.  పదవి నుంచి తప్పించడంతో నియోజకవర్గ ప్రజలు బాధతో ఉన్నారని పేర్కొన్నారు. బాధను అధిగమించి పార్టీ సభ్యాత్వాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. కడిగిన ముత్యాంలా తాను బయటకు వస్తానని  రాజయ్య అన్నారు. కొద్ది రోజుల క్రితం తనపై వచ్చిన ఆరోపణలతో తాను ఎంతో మనస్థాపానికి గురయ్యానని పేర్కొన్నారు. దళితుల చైతన్యం కోసం, దళితుల సంక్షేమం కోసం ఓ క్రమశిక్షణ గల కార్యకర్తగా పార్టీలో పనిచేస్తాని తెలిపారు. దళితుల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు. అందుకు కసిగా సభ్యత్వ నమోదు చేపట్టాలని అన్నారు. కొందరు కుట్ర చేసి తనను తొలగించేలా చేశారని ఆయన అన్నారు.  తన వెనుక కొందరు గోతులు తీశారని వాపోయారు. తనపై అవినీతి ఆరోపణలు రుజువైతే ఉరి శిక్షకు సిద్దమేనని ఆయన ప్రకటించారు.స్టేషన్‌ ఘనపూర్‌ నియోజకవర్గంలో ఆయన టిఆర్‌ఎస్‌ సభ్యుత్వ నమోదు కార్యక్రమంలో ప్రసంగించారు.కొందరు కార్యకర్తలు రాజయ్యకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.తదుపరి రాజయ్య భావోద్వేగంతో మాట్లాడుతూ తనకు వ్యతిరేకంగా కొందరు కుట్ర చేశారని వాపోయారు.అయినా కెసిఆర్‌ ఒక అవకాశం ఇచ్చారని, విచారణలో తాను కడిగిన ముత్యం లా బయటకు వస్తానని,తాను ఏ తప్పు చేయలేదని, తన వెనుక కొందరు గోతులు తీశారని ఆయన వాపోయారు.  తనకు తెలియకుండా  నియోజకవర్గంలో ఏ నాయకుడైనా అడుగుపెడితే ఊరుకోనన్నారు. ఏదైనా నియోజకవర్గ ఇంచార్జీ, ఎమ్మెల్యేకు తెలిసే… జరగాలని హెచ్చరించారు.  మరోవైపు ఆయన  ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలోనే బంగారు తెలంగాణ కోసం పాటుపడతానని చెప్పటం విశేషం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలోనే బంగారు తెలంగాణ కోసం పాటుపడతానని చెప్పటం విశేషం. కాగా తనను పదవి నుంచి తప్పించటంపై నియోజకవర్గ ప్రజలు బాధపడుతున్నారన్నారు.