ఇది ఓ చారిత్రాత్మకమైన రోజు

– ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథరెడ్డి

చిత్తూరు, జులై5(జ‌నం సాక్షి) : ఇది ఓ చారిత్రాత్మకమైన రోజు అని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథరెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా పెద్దపంజాని మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎన్టీఆర్‌ గృహ ప్రవేశ మ¬త్సవ కార్యక్రమంలో ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈ రోజు ఓ చారిత్రాత్మక రోజు అని తెలిపారు. దేశంలోనే మొట్టమొదటిసారి 3లక్షల ఇళ్లు గృహ ప్రవేశం చేయడం ఇదే ప్రథమంమన్నారు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారి కలలు సాకారం చేయడంలో సీఎం చంద్రబాబుగారు వందకు వంద శాతం లక్ష్య సాధనలో ముందుకెళుతున్నారన్న దానికి ఈ ఎన్టీఆర్‌ గృహ ప్రవేశాలు నిదర్శనం. గతంలో ప్రభుత్వాలు హౌసింగ్‌ స్కీమ్‌ లో పేదవారికి లబ్ధి కలుగకుండా వారి పేరుతో లక్షల కోట్లు దోచుకుని పేద వారికి లబ్ధి చేకూర్చకుండా చేశారు. కానీ నేడు పార్టీలకు, వర్గాలకు కులమతాలకు అతీతంగా నిజమైన లబ్ధిదారులకు పారదర్శకంగా అందిస్తున్న ప్రభుత్వం తెదేపానేని స్పష్టం చేశారు. కుటుంబాలు పెరుగుతున్నాయని, రేషన్‌ కార్డులు విభజన అవుతున్నాయని, ఇళ్ల నిర్మాణం కూడా పెరుగుతోంది అందుబాటులో తగినంత స్థలందొరకడం లేదన్నారు. అందుకే పట్టణ పరిసర ప్రాంతాలలో పేదల కోసం జీ ప్లస్‌ త్రీ జీ ప్లస్‌ టూ అపార్టుమెంట్‌ తరహాలో అన్ని సదుపాయాలతో ఇళ్ల నిర్మాణానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి తెలిపారు. జిల్లాలో దాదాపు ఇరవై రెండు వేల ఇళ్ల గురువారం అన్ని నియోజకవర్గాలలో గృహప్రవేశాలు చేస్తున్న వారికి తన శుభాకాంక్షలంటూ మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు తెదేపా నేతలు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.