ఇది ద్రవ్యబిల్లు
– లోక్‌సభ స్పీకర్‌దే నిర్ణయాధికారం
– రాజ్యసభ చైర్మన్ కురియన్
న్యూఢిల్లీ,ఆగస్టు 5(జనంసాక్షి):అంతా ఆసక్తిగా ఎదురుచూసిన ఏపీ ¬దా బిల్లు లోక్‌సభకు వెళ్లింది. ఏపీలో ఎంతో ప్రాముఖ్యంగా ఉన్న కెవిపి ప్రైవేటు బిల్లుపై అభ్యంతరాలు వచ్చాయని, ఈ బిల్లుపై ముందుకు వెళ్లలేమని రాజ్యసభ స్పీకర్ పేర్కొన్నారు. అలాగే ఈ బిల్లును లోక్‌సభ స్పీకర్‌కు పంపుతామని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ సభలో ప్రకటించారు. ప్రైవేటు మెంబర్ బిల్లుపై చర్చ పూర్తయి ఓటింగ్‌కు సిద్ధంగా ఉందని, ఇప్పుడు మళ్లీ చర్చించే పని లేదని కురియన్ పేర్కొన్నారు. బిల్లు ఏ దశలో ఉన్నా అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవచ్చని, మనీ బిల్లు అవునా కాదా నిర్ణయించే అధికారం రాజ్యాంగం ప్రకారం రాజ్యసభకు లేదని ఆయన అన్నారు. అంతేకాకుండా ప్రైవేట్ బిల్లు మనీ బిల్లు అవునో కాదో లోక్‌సభ స్పీకరే తేలుస్తారని వివరించారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సభలో ఆందోళన చేశారు. వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన వ్యక్తం చేస్తూ ఏపీకి న్యాయం చేయాలంటూ నినాదాలు ఇచ్చారు. ఒకవైపు కాంగ్రెస్ సభ్యుల ఆందోళనలతో సభలో పూర్తిగా గందరగోళ పరిస్థితి నెలకొనడంతో డిప్యూటీ చైర్మన్ కురియన్ సభను సోమవారానికి వాయిదా వేసేశారు. ముందుగా మధ్యాహ్నం సభ ప్రారంభమైన వెంటనే కేవీపీ బిల్లుపై చర్చ ప్రారంభమైంది. మాజా ప్రధాని మన్మోహాన్ సింగ్ మాట్లాడుతూ విభజన సమయంలో ఇచ్చిన హావిూలను ప్రభుత్వం అమలు చేసి సభా గౌరవాన్ని కాపాడాలని స్పష్టం చేశారు. అనంతరం కేవీపీ మాట్లాడుతూ ప్రైవేటు బిల్లు సభ్యుడి హక్కు అని, .బిల్లుపై చర్చ పూర్తయినప్పటికీ కోరం లేక ఓటింగ్ వాయిదా పడిందని చెప్పారు. మరోవైపు ప్రత్యేక ¬దా ఇవ్వడానికి చట్టం అక్కర్లేదని కేవీపీ వివరించారు. సభలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ… ఈ బిల్లుపై రాజ్యాంగ ప్రకారం రాజ్యసభలో ఓటింగ్ చేపట్టలేమని, ఇది మనీ బిల్లు అని, దీనిని ప్రవేశపెట్టే అవకాశం లోక్‌సభలోనే ఉందని పేర్కొన్నారు. అలాగే మనీబిల్లు అవుతుందా కాదా అనే విషయంలో కూడా స్పష్టత రావాలని, దానిని తేల్చే అధికారం ఒక లోక్‌సభ స్పీకర్‌కే ఉంటుందని జైట్లీ వివరించారు. దీంతో జైట్లీ వ్యాఖ్యలపై విపక్షాలు ఒక్కసారిగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ…. ఆజాద్, ఏచూరి సూటిగా ఓ ప్రశ్నను సంధిస్తూ…. నాటి ప్రధాని ఇచ్చిన హావిూలను నెరవేరుస్తారా లేదా చెప్పాలని స్పష్టంగా అడిగారు. వెంటనే కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ మాట్లాడుతూ…. ప్రత్యేక ¬దా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పిందనడం అవాస్తవమని, ఈ విషయమై తాను నిరూపిస్తానని అన్నారు. దేశ ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సభను తప్పుదోవ పట్టించే చర్యలు మానుకోవాలని అన్నారు. అలా బిల్లును జైట్లీ మనీ బిల్లు అనడాన్ని ఎంపీ కపిల్ సిబల్ తప్పుబడుతూ… ప్రతి బిల్లు ఏదో ఒక రకంగా డబ్బుతో ముడిపడి ఉంటుందని, ఈ విషయాన్ని గమనించాలని అన్నారు. అలా ఆలోచిస్తే ఏ విధంగా ఏ బిల్లునూ రాజ్యసభలో పెట్టలేమని వివరించారు. ఆర్థికలోటు పూడ్చాలని తీసుకున్న బిల్లు మనీ బిల్లు కాదని, కావాలంటే మరోసారి స్పష్టంగా చూసుకోవాలని పేర్కొన్నారు. కాని రాజకీయ అవసరాల కోసం రాజ్యాంగాన్ని వక్రీకరించడం తగదని, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్దమని అన్నారు. నిజానికి కేంద్ర ప్రభుత్వానికి ఏపీకి స్పెషల్ ప్యాకేజీ ఇవ్వాలనే లేదని సిబల్ ఈ సందర్భంగా ఆరోపించారు. మరోవైపు విభజన సమయంలో ఆనాటి ప్రధాని ఇచ్చిన హావిూలను ఎలా నెరవేర్చాలో చూస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా విభజన చట్టంలో ఉన్న అన్ని హావిూలు నెరవేర్చేందుకు కృషిచేస్తున్నామన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఏపీని ఆదుకునే విషయంలో తాము చిత్తశుద్ధితో ఉన్నామని, దీనిని అందరూ గ్రహించాలని అరుణ్‌జైట్లీ చెప్పారు. గతంలో దీనిపై చర్చించామని, చట్టపరంగా చేయాల్సినవన్నీ జరుగుతున్నాయని, రాజ్యాంగ ప్రకారం రాజ్యసభలో దీనిపై ఓటింగ్ చేపట్టలేమమే విషయాన్ని సభ సభ్యులు గమనించాలని కోరారు. అంతేకాకుండా ప్రత్యేక ¬దాపై ఈరోజు కూడా ఏపీ సీఎం, ఎంపీలతో చర్చించామని పేర్కొన్నారు. దీంతో తాను ప్రధానిగా ఉన్న ప్పుడు ఏపీకి ఇచ్చిన హావిూలను ప్రభుత్వం నెరవేర్చాలని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ మాట్లాడుతూ అన్నారు. అప్పుడు తాను ఇచ్చిన ఆరు హావిూలపై అరుణ్‌జైట్లీ సంతృప్తి వ్యక్తం చేసినట్లు మన్మోహన్ సింగ్ గుర్తుచేశారు. అంతేకాకుండా తాను ప్రధానిగా ఇచ్చిన హావిూలపై 2014, మార్చి 1న అప్పటి కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపిందని, ఆ ముసాయిదా ప్రతిని రాష్ట్రపతికి పంపగా ఎన్నికల షెడ్యూల్లో ఉన్నందున ఆగిపోయిందని చెప్పారు. వెంటనే తాను ప్రధాని ¬దాలో ఇచ్చిన హావిూలను ఇప్పటి ప్రభుత్వం నెరవేర్చి సభా గౌరవాన్ని కాపాడాలని మన్మోహన్ సింగ్ కోరారు. తీవ్ర వాగ్వాదం…ఎంపీ జైరాం రమేష్, డిప్యూటీ చైర్మన్ కురియన్ మధ్య రాజ్యసభలో వాగ్వివాదం చోటుచేసుకోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. కెవిపి పెట్టిన ప్రైవేట్ బిల్లు చర్చ ముగిసిందని కురియన్ ప్రకటించడంతో జైరాం రమేష్ ఒక్కసారిగా లేచి అభ్యంతరం వ్యక్తం చేశారు. పునర్ వ్యవస్థీకరణ అంశాలపై మాట్లాడేందుకు ఆయన ప్రయత్నించగా, కేవీపీ ప్రైవేట్ బిల్లుపైనే మాట్లాడాలని డిప్యూటీ చైర్మన్ ఒకవైపు సూచించారు. కేవలంన కేవీపీ బిల్లు ద్రవ్యబిల్లా కాదా అన్నదానిపైనే ప్రస్తుతం చర్చ అని కురియన్ స్పష్టం చేశారు. దీంతో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వరా అంటూ జైరాం రమేష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ మండిపడ్డారు. అనంతరం మాట్లాడిన కాంగ్రెస్ గులాం నబీ ఆజాద్ విభజన హావిూలు నెరవేర్చాలని, మనీ బిల్లు అనడం అన్యాయమన్నారు. కాని కేవీపీ బిల్లు మనీబిల్లా కాదా అనేది లోక్‌సభ స్పీకర్‌ను అడుగుతామంటూ కురియన్ మరో చర్చలోకి వెళ్లడంతో కాంగ్రెస్ సభ్యులు ఒక్కసారిగా పోడియంను చుట్టుముట్టారు. గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో సభను సోమవారానికి వాయిదా వేయాల్సి వచ్చిది.