ఇదేం పారిశుద్ధ్యం
-ఢిల్లీలో చెత్త తొలగించకపోవడంపై హైకోర్డు సీరియస్
న్యూఢిల్లీ,జనవరి29: దేశ రాజధాని అయిన దిల్లీలో పారిశుద్ధ్యం సరిగా లేదని దిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రపంచ స్థాయి నగరంలా కాకపోయినా కనీసం ఆసియా స్థాయి నగరంలా కూడా లేదంటూ ఎద్దేవా చేసింది. పారిశుద్ధ్యం విషయంలో నగరం చాలా వెనకబడి ఉందంది. చెత్తను ఎప్పటికప్పుడు తొలగించడంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని న్యాయస్థానం విమర్శించింది. పారిశుద్యం నిర్వహించడంలో వెనకబడినట్లు గుర్తించారు.