ఇద్దరు అరెస్టు
కడప, జూలై 27 :నగర శివార్లలోని ఒక చికెన్ సెంటరులో దోపిడీకి గురైన సొమ్ముతో పాటు ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నట్టు కడప డిఎస్పి రాజేశ్వర్‌రెడ్డి చెప్పారు. కడప నగర శివార్లలోని మాసాయిపేటలో కిషోర్‌కుమార్‌రెడ్డి అనే వ్యక్తి చికెన్ సెంటరు నిర్వహిస్తున్నారని అన్నారు. చికెన్ సెంటరులో నామాపల్లి గ్రామానికి చెందిన సురేష్‌కుమార్, మరో వ్యక్తి కిషోర్ పనిచేస్తున్నారని డిఎస్పి చెప్పారు. వీరు ఈ నెల 15వ తేదీన చికెన్ సెంటరులో ఉన్న 7.5 లక్షల మొత్తాన్ని దోపిడీ చేశారన్నారు. వీరిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 6.35 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసు విచారణలో సిఐలు నాగేశ్వర్‌రెడ్డి, పురుషోత్తమరాజుతో పాటు సిబ్బంది ఉన్నారని డిఎస్పి వివరించారు.