ఇద్దరు సీఎంలు ” చంద్రులతో” గవర్నర్‌ సమావేశం

3

-హోం ఎట్‌ గవర్నర్‌ కార్యక్రమంలో

45 నిమిషాల సేపు నరసింహన్‌ ప్రత్యేక భేటి

హైదరాబాద్‌,జనవరి26(జనంసాక్షి): తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌,  ముఖ్యమంత్రులు చంద్రశేఖర్‌రావు,చంద్రబాబు నాయుడు,  మరోమరు కలిశారు. రిపబ్లిక్‌ డే సందర్భంగా రాజ్‌భవన్‌లో జరిగిన ఎట్‌ ¬ం కార్యక్రమం ఇందుకు

వేదికైంది.గవర్నర్‌ నరసింహన్‌ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఇరు రాష్ట్రాల సీఎంలతో పాటు స్పీకర్లు, మంత్రులు, డీజీపీలు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు, కేసీఆర్‌ పలు విషయాల గురించి చర్చంచుకున్నారు. చంద్రబాబు, కేసీఆర్‌.. గవర్నర్‌కు చెరో పక్కన ఆశీనులయ్యారు. ఇరు రాష్ట్రల మధ్య ఉన్న సమస్యల

పరిష్కారానికి గవర్నర్‌ చొరవజూపారు.45నిమిశాలు ప్రత్యేక భేట జరిగింది.  ఈ కార్యక్రమం అనంతరం గవర్నర్‌.. చంద్రబాబు, కేసీఆర్‌లతో ప్రత్యేకంగా

సమావేశమై పలు విషయాల గురించి చర్చించారు.