ఇనుగుర్తి లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం…
పాఠశాలకు 70 వేల రూపాయల వస్తువుల బహుకరణ.
కేసముద్రం ఆగస్టు 28 జనం సాక్షి / మండలంలోని ఇనుగుర్తి గ్రామంలో జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో 1997 -1998 పదవ తరగతి పూర్వ విద్యార్థుల వజ్రోత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ పాఠశాల ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు రాజేందర్ గారి అధ్యక్షతన పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం అద్భుతంగా కొనసాగింది. గురువులు కన్న సాంబయ్య , కర్ర శ్రీనివాస్ రెడ్డి,రహమాన్, వెంకటరమణాచారి ,జై సాగర్,శ్రీరాములు మాట్లాడుతూ సిల్వర్ జూబ్లీ కంటే ఘనంగా గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు జరుపుకోవాలని ఈ బ్యాచ్ విద్యార్థులందరూ చక్కటి ప్రణాళికతో భవిష్యత్తుకు రాజమార్గం మార్గం వేసుకోని ఉన్నత లక్ష్యంతో ముందుకెళ్లాలని ఆకాంక్షించారు. అధ్యాతం అద్భుతమైన కవిత్వాలతో సభా ప్రాంగణం పులకించిపోయింది. పూర్వ విద్యార్థి కొమ్మాల సంధ్య సేకరించి వెలువరించిన పూల జాతర బతుకమ్మ పాటల పుస్తకము ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు త్రాగునీరు నిమిత్తం వాటర్ ఫ్రిడ్జ్, కలర్ ప్రింటర్,స్కానర్ సుమారు 70 వేల రూపాయల విలువైన వస్తువులను బహుకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు మామిడి అశోక్, గంజి చందర్, ఓ మురళి, జి అశోక్, వి శ్రీనివాస్, వి రమేష్,వి రవి, వి రాజు,నరేష్, రాజేందర్, రవీందర్, విజయ్, సోమన్న, లక్ష్మణ్, జంపయ్య, సునీల్,రవి, మధు, మురళీమోహన్, వినోద్, కొమ్మాల సంధ్య, పావని, కవిత, వాహిని, స్వర్ణలత, మాధవి, జ్యోతి, రమ, మహమ్మదీ బేగం తదితరులు పాల్గొన్నారు.