ఇన్నర్ వీల్ క్లబ్ లో యోగా వేడుకలు
వరంగల్ ఈస్ట్, జూన్ 21(జనం సాక్షి):
వరంగల్ మహా నగరంలోని కొత్త వాడ ఇన్నర్ వీల్ క్లబ్ లో మంగళవారం ఎనిమిదవ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు .వేదశ్రీ యోగ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో యోగా గురువు మహేష్ దంపతులు, ప్రపంచ మిమిక్రీ కళాకారుడు నేరెళ్ళ వేణుమాధవ్ సతీమణి విజయలక్ష్మి ,అలాగే యోగ విద్యార్థులు పాల్గొన్నారు.
