‘ఇన్సూరెన్స్ డబ్బు కోసం భర్తే హత్య చేశాడు’
హైదరాబాద్ : ఆస్ట్రేలియాలో మృతిచెందిన రమ్యకృష్ణ మృతదేహానికి హైదరాబాద్ కూకట్‌పల్లిలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.. మృతురాలిని ఆమె భర్తే హత్య చేశాడని బంధువులు ఆరోపిస్తున్నారు.. రెండున్నర కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ డబ్బుకోసం భర్తే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని చెబుతున్నారు.. ఆస్ట్రేలియాలో ఉంటున్న మహంత్‌తో రమ్యకృష్ణకు మూడేళ్ల క్రితం వివాహమైంది. రెండు రోజుల క్రితం… రమ్యకృష్ణ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది…. రమ్య మృతదేహాన్ని భారత్‌కు తీసుకువచ్చేందుకు ప్రయత్నించిన బంధువుల్ని మహంత్ ముప్పుతిప్పలు పెట్టాడు.. మృతదేహాన్ని హైదరాబాద్ శంషాబాద్‌లో దించాక పాస్‌పోర్ట్‌తో అదే ఫ్లైట్‌లో ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. పాస్‌పోర్ట్ ఉంటేనే ఇన్సూరెన్స్ డబ్బు వస్తుందని ఇలా చేశాడని బంధువులు మండిపడుతున్నారు.