ఇబ్రహీంపట్నం ఘటనపై తీన్మార్ మల్లన్న ఆగ్రహం

 ఇబ్రహీంపట్నం ఘటనకు మంత్రి హరీష్ రావు బాధ్యత వహించాలి
 ముఖ్యమంత్రి బాధిత కుటుంబ సభ్యుల కాళ్లు మొక్కి క్షమాపణ కోరాలి.
 మంత్రివర్గ సమావేశాల్లో ఘటనపై చర్చ జరగాలి.
రంగారెడ్డి/ ఇబ్రహీంపట్నం, (జనం సాక్షి):- ఇబ్రహీంపట్నం ఘటనకు బాధ్యత వహిస్తూ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు తక్షణమే రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు సీనియర్ జర్నలిస్ట్, క్యూ న్యూస్ సంస్థల యాజమాని తీన్మార్ మల్లన్న.కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చెపించుకొని వైద్యం వికటించి చనిపోయిన నలుగురు మహిళలల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని,ఇవి ప్రభుత్వ హత్యలుగా పరిగణించాలని అన్నారు.నేడు ఇబ్రహీంపట్నంలో జరిగిన సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు.నిన్ననే తీన్మార్ మల్లన్న టీం సభ్యులు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్ధిక సాయం అందించామని తెలిపారు.ఇంత దారుణమైన ఘటన జరుగుతే సంబంధిత మంత్రిలో చలనం లేదన్నారు. కేసీఆర్ గారాల పట్టి కవితపై అవినీతి ఆరోపణలు వస్తే ఆమెను పరామర్శించేందుకు మంత్రులకు సమయం ఉంది కాని నేడు అమాయక, పేద మహిళలు నలుగురు చనిపోతే వారిని ఓదార్చేందుకు తీరడం లేద అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో విద్య, వైద్యాన్ని బ్రష్టు పట్టించిన నీచ చరిత్ర కేసీఆర్ ది అని ఫైర్ అయ్యారు. కేసీఆర్ కు, వారి కుటుంబ సభ్యులకు రోగం వస్తే యశోద, అపోలో దవాఖానలో చికిత్స చేపించుకుంటారు అదే పేదవాడికి మాత్రం సవలతులు లేని సర్కార్ హాస్పటల్ కు పంపించి ప్రాణాలు తీస్తారా అని ప్రభుత్వం పై మండిపడ్డారు. కూట్లే  రాయి తీయనోడు ఏట్లా రాయి తీయబోయినట్టు ఇక్కడి పరిపాలనే పట్టిచుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలంటూ కొత్త బిచ్చగాని అవతారం ఎత్తరని విమర్శించారు. తెలంగాణలో బడులు, దవాఖానల కంటే వైన్స్, బెల్టు షాపుల సంఖ్య వంద రేట్లు అధికంగా ఉన్నాయన్నారు.రాష్ట్ర సంపదని దోచుకోవడం పూర్తయింది, దేశ సంపదను ఎట్లా దోచుకోవలన్న దానిపై నేడు ప్రగతి భవన్ లో మంత్రి వర్గ సమావేశం జరుగుతుంది ఈ సమావేశంలో ఇబ్రహీంపట్నం ఘటన పై చర్చ జరగాలని, ఘటనకు భాద్యులయున వారిపై చర్యలు తీసుకోని, మంత్రి హరీష్ రావును బర్తరఫ్ చేయాలని,కేసీఆర్ స్వయంగా వచ్చి బాధిత కుటుంబ సభ్యలకు క్షమాపణ కోరి వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలని డిమాండ్ చేశారు.