ఇరాక్‌లో దురాక్రమణదారుడు జార్జిబుష్‌పై బూటు విసిరితే ..

సీమాంధ్ర దురహంకారి విజయమ్మకు
చెప్పుచూపిన ‘షేర్నీ’ రహిమున్సీసా
చాకలి ఐలమ్మ, సమ్మక్క-సారక్క వారసత్వం, బెల్లి లలిత ధీరత్వం
తెలంగాణ ముద్దుబిడ్డ రహిమున్నిసాతో ‘జనంసాక్షి ‘ ప్రత్యేక ఇంటర్ఫ్యూ
ఇరాక్‌ రాజ్యాన్ని దురాక్రమణ చేసిన ఓ దుర్మార్గుడు ప్రపంచ రక్తం తాగిన జార్జ్‌ బుష్‌తన కిరాయి సైనిక బలగాలతో ఇరాక్‌లో పర్యటించేవాడు. అడుగడున తుపాకులు ప్రజల గుండెలపై ఎక్కుపెట్టి ఎవరైనా నోరు తెరిస్తే వారి నోట్లో తూటాలు పేల్చేందుకు నాటోదళాలు బూచోడు బుష్‌కు రక్షణగా ఉండేవి. ఇరాక్‌లో అక్కడి ప్రజల ఆకాంక్షలకు ప్రతి రూపంగా పోరాట వారసునిగా ఓ జర్నలిష్టు బుష్‌పై బూటు విసిరితే శభాష్‌ బిడ్డ అంటూ ప్రపంచం అంతా కరతాల ధ్వనులతో మారుమ్రోగింది. అదే తరహాలో సీమాంధ్ర కిరాయి గుండాలతో విజయమ్మ తెలంగాణలో పర్యటించింది. ఈ గడ్డపై దేశ్‌ముఖ్‌లకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ నినదించింది. ఆదివాసీల రాజ్యంపై కాకతీయులు దండెత్తినప్పుడు సమ్మక్క, సారలమ్మలు తిరగబడి విరోచితంగా పోరాడారు. వీర స్వర్గాన్ని పొందారు. దోపిడి పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ గొంతుక అయి పోరాడిన మాచెల్లి బెల్లి లలిత ముక్కలయింది. అదే వారసత్వాన్ని పుణికిపుచ్చుకొన్న తెలంగాణ షేర్ని రహీమున్నిసా మన గడ్డపై దుర్మార్గంగా అడుగు పెట్టిన సీమాంధ్ర దురహంకారిణి విజయమ్మకు చెప్పుచూపింది. కొదమసింహం అయి గర్జించింది. సీమాంధ్రులు తెలంగాణ గడ్డపై దండయాత్ర చేసిన ప్రతిసారి అది మహబూబాబాద్‌ లో జగన్‌ ఐనా, వరంగల్‌లో బాబు ఐనా, సకల జనుల సమ్మెలో పోలీసుల ఓవరాక్షన్‌ కావచ్చు ప్రతీసారి రహీమున్నీసా తన ధిక్కార స్వరాన్నే విన్పించింది. సిరిసిల్లలో విజయమ్మ యాత్ర సందర్భంగా దాడికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రహీమున్నీసా జనంసాక్షితో మాట్లాడింది. తనపై దాడిని సాకుగా చూపి తెలంగాణ బిడ్డలపై కేసులు పెట్టవద్దనీ, తనపై దాడి చేసింది ముమ్మాటికీ సీమాంధ్ర గుండాలేనన్న ఆమెకు జన్మనిచ్చిన గడ్డపై ఉన్న మమకారాన్ని అర్థం చేసుకోవచ్చు. వివరాలో ఆమె మాటల్లోనే….
వరంగల్‌, జూలై 26 (జనంసాక్షి) :ప్రజాసామ్యభదంగా తెలంగాణ రాష్ఠ్రకోసం పోరాటం చేస్తున్న మహిళల పై సిమాంద్రగుండాలు మహిళలపై దౌర్జన్యం చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని లైఫ్‌లైన్‌ దవఖానలో చెరి చికిత్స పొందుతున్న రహిమున్నీసా అన్నారు.సిమాంధ్రగుండాలు ,నకిలి పోలిసోల్లను పెట్టుకొని తెలంగాణ ఉద్యమాన్ని అనిచి వెసేందు కుట్రపనుతున్నదని ఆమె అన్నారు.వైఎస్‌అర్‌ సి పి విజయమ్మ పర్యటన జరిగిన దాడిలో చికిత్స పొందుతూ కూడ చివరి కంటూ తెలంగాణ కోసంమెఅని అన్నారు.ఒక మహిళ అని చూడకుండ కింద పడెపి భుట్లతో తోక్కి, ఎక్కడ పడితె అక్కడ తన్ని,కడప గుండాలతో విక్షణరహింతగా కోట్టారన్నారు. సిమాంధ్ర గుంటనక్కలను కటినంగా శిక్షించి రాష్రఫ్రభుత్వంఅదుకొవాలని ఆమె డిమాండ్‌ చేసారు. విజయమ్మను ఎదిరించ్చినందుకే నాపైదాడి జరిగిందన్నారు.సిమాంధ్ర నాటకాలు ఇకనుండి మాతెలంగాణ లో జరుగవని అన్నారు.
రహిమున్నిసాను పరమర్శించిన టిఅర్‌ఎస్‌ నాయకులు
సీమాంధ్రగుండాల చేతిలో గాయలు పాలు అయిన తెలంగాణ బిడ్డను టిఅర్‌ఎస్‌ శాసన సభ్యులు ,ఇటల రాజెందర్‌ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బతిసెందుకె, అత్మస్థైర్యం సడలించెదుకు ,సిఎమ్‌ వైఎస్‌ అర్‌ సిపితో కుమ్మకైయ్యారని దుయ్యబట్టారు.దాడిచేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు.ప్రజాసామ్యభతంగా నిరసన తెలుపుతున్న తెలంగాణ వాదులపై ,ముఖ్యంగా మహిళపై సిమాంధ్ర పోలిసులు ,గుండాలు అమానుషంగా దాడి చెయ్యడం సోచనియంఅన్నారు.తెలంగాణపట్ల చిత్తశుద్ది ఉంటె కేంద్రాని లేఖ ఇవ్వాలని వారు డిమాండ్‌ చేసారు. పరకాల ఎమ్మెల్యె మెలుగురి బిక్షపతి మాట్లాడుతూ మహిళ అని చూడకూండ దాడి విక్షణరహితంగా దాడిచెసి గాయపర్చరని అయన మండిపడ్డారు. వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యె వినయ్‌భాస్కర్‌ మాట్లాడుతూ ఉద్యమాన్ని దెబ్డతిసేందుకు సిరిసిల్ల దిక్ష చేపట్టారన్నారు.అలాగె తెలంగాన బిడ్డలపై దాడికి పాల్పడిన రాయలసిమ గుండాలను వారికి వత్తాస్‌ పలికిన తెలంగాణ ద్రోహులను విడిచి పెట్టేది లెదని టిఅర్‌ ఎస్‌ మాజి ఎంపి వినొద్‌ కుమార్‌ అన్నారు.జిల్లా టిఅర్‌ఎస్‌ అధ్యక్షుడు పెద్ది సుదర్శన్‌ రెడ్డి మాట్లాడుతూ సిరిసిల్లా ఘటనకు బదులు తిర్చుకుంటామని అన్నారు.లలితను రహిమున్నిసను పార్టిఅన్నివిదాలుగా అదుకుంటుందని బరోస ఇచ్చారు.