ఇళ్లు లేని పేదలందరికి గృహవసతి: మంత్రి నక్కా
గుంటూరు,జూలై5(జనం సాక్షి ): వేమూరు నియోజక వర్గం దోనెపూడి, వేమూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన ఎన్టీఆర్ గృహాలను గురువారం మంత్రి నక్కా ఆనందబాబు ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ…రానున్న రోజుల్లో ఇళ్లు లేని ప్రతి పేదవారికి ఇళ్లను నిర్మించడమే ప్రభుత్వం లక్ష్యమన్నారు. ఎస్సీలకు 2 లక్షల రూపాయలు ఇళ్ల నిర్మాణానికి సాయంగా, 100యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తామన్నారు. ఆర్థిక లోటు ఉన్నప్పటికీ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ కుందుర్పి మండలం తెనగల్లు గ్రామంలో గురువారం ఎన్టీఆర్ పక్కా గృహాలు స్థానిక ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి ప్రారంభించారు. అనంతరం కుందర్పి మండల కేంద్రంలో అమ్మా మండల సమాఖ్య నిధులతో మేలు రకం పొట్టేళ్లను 19 మంది సభ్యులకు శాసనసభ్యుల చేతుల విూదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పెద్ద నరసింహప్ప, స్థానిక యం పి టి సి సభ్యురాలు లక్ష్మి దేవి, అధికారులు హౌసింగ్ డిఇఇ బి శివకూమర్, ఎఇ విజరు కుమార్, ఏరియా కోఆర్డినేటర్ రోజమ్మ , ఎపియం గుణశ్యాం, వెటర్నరీ డాక్టర్ రవితేజ, మండల సమాఖ్య సభ్యులు నాగమ్మ, లీలబారు, వెలుగు సిసిలు, స్థానిక ప్రజా ప్రతినిధులు జడ్పీటిసి మల్లికార్జున, స్థానిక మండల పరిషత్ అధ్యక్షులు దీనమ్మ , ఉప అధ్యక్షులు రవి, స్థానిక సర్పంచ్ కఅష్ణవేణి , స్థానిక యం పి టి సి గవిసిద్దప్ప , పలు గ్రామాల సర్పంచులు, యం పి టి సి సభ్యులు, నాయకులు, టిడిపి మండల కన్వీనర్ ధనుంజయ, యస్సీ సెల్ కన్వీనర్ హనుమంతరాయుడు, సిబియన్ ఆర్మీ టీం లీడర్ రామమూర్తి నాయుడు, కార్యకర్తలు పాల్గొన్నారు.