ఇళ్ల నిర్మాణాలకు నిధులు మంజూరు
కామారెడ్డి,ఏప్రిల్20(జనంసాక్షి): గ్రామాల్లో పేదలకు డబుల్‌బెడ్‌రూం ఇండ్లు నిర్మించి ఇచ్చేందుకు రూ. 35 కోట్లతో 500 ఇండ్ల నిర్మాణాలు వేగవంతంగా కొనసాగుతున్నాయని దేశాయిపేట్ సహకార సంఘం అధ్యక్షుడు పోచారం భాస్కర్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గానికి మొత్తం 3 వేల ఇండ్లను మంజూరు చేశారని తెలిపారు. బాన్సువాడతో పాటు వర్ని, బీర్కూర్, కోటగిరి మండలాల్లో ఇండ్ల నిర్మాణాలు
కొనసాగుతున్నాయని అన్నారు. సమాజంలో ప్రతి పేద కుటుంబం ఆత్మగౌరవంతో బతికేలా డబుల్ బెడ్‌రూం ఇండ్లు నిర్మించి ఇస్తామని అన్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రత్యేక చొరవతో బాన్సువాడ నియోజకవర్గంలో డబుల్‌బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలు వేగవంతంగా సాగుతున్నాయన్నారు. నిరుపేదల కోసం రాష్ట్రంలో 2.65లక్షల ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.