ఇవిఎంలలో అభ్యర్థుల భవిష్యత్‌ నిక్షిప్తం

టెన్షన్‌లో పార్టీల అభ్యర్థులు
11 వరకు ఊపిరి బిగబట్టాల్సిందే
ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలతో ఇరువర్గాల్లో భరోసా
హైదరాబాద్‌,డిసెంబర్‌8(జ‌నంసాక్షి): ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వేర్వేరుగా ఉండడంతో ఇప్పుడు అభ్యర్థులు భరోసాగా ఉన్నారు. ఇరువర్గాలకుభరోసా కలిగించేలా సర్వేలు ఉన్నాయి. దాదాపు రెండు నెలలుగా ¬రెత్తుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఘట్టం శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. దీంతో ఇవిఎంలలో అభ్యర్థుల భవిష్యత్‌ నిక్షిప్తం అయ్యింది. ఎవరు గెలుస్తారన్నది ఇప్పుడు లెక్కలు వేస్తున్నారు.
తెలంగాణతోపాటు రాజస్థాన్‌,మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరం రాష్టాల్లో కూడా ఎన్నికలు పూర్తయ్యాయి. మరో రాష్ట్రం రాజస్తాన్‌ పోలింగ్‌ తెలంగాణతోపాటే జరగబోతోంది. తెలంగాణలో తొలిసారి జరగబోతున్న ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పక్షం అంతిమ విజేతగా నిలుస్తుందన్న అంశంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల సంఘం నవంబర్‌ 12న తెలంగాణ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసినా అంతకు నెల రోజుల ముందే టీఆర్‌ఎస్‌ తన అభ్యర్థుల్ని ఖరారు చేసుకుని ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టింది. మొత్తంగా ఈ ఎన్నికల్లో ఇప్పుడు టిఆర్‌ఎస్‌ ధీమాగా ఉండగా, అంతే ధీమాగా ప్రజాకూటమి కూడా ఉంది. ప్రజలు ఎవరిని ఆదరిస్తారన్నది 11న మంగళవారం తేలనుంది. మంగళవారం వరకు అభ్యర్థులకు టెన్షన్‌ తప్పేలా లేదు.
ప్రతి పార్టీ ఈ ఎన్నికలను చావో రేవో అన్నట్టు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్‌ తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతోపాటు సీనియర్‌ నాయకులు, కేంద్ర మాజీ మంత్రులు రాష్టా నికొచ్చి సభలూ, సమావేశాల్లో మాట్లాడారు. బీజేపీ నుంచి ప్రధాని నరేంద్రమోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా మొదలుకొని కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ సీనియర్‌ నాయ కులు వివిధ జిల్లాల్లో జరిగిన సభలూ, సమావేశాల్లో పాల్గొన్నారు. టీఆర్‌ఎస్‌ తరఫున ముఖ్య మంత్రి కె. చంద్రశేఖరరావు అన్నీ తానే అయి దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ అభ్యర్థుల తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు. ఎప్పటికప్పుడు పార్టీ వ్యూహానికి పదునుపెడుతూ పార్టీ శ్రేణులను ఉరికించారు. పార్టీ కీలక నేతలు కెటిఆర్‌, హరీశ్‌రావు, కవితలు సైతం పలు నియోజక వర్గాల బాధ్యతలను తీసుకుని ప్రచారం చేశారు.
ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని సంకల్పించుకున్న కాంగ్రెస్‌…అందుకోసం తన చిరకాల ప్రత్యర్థి
అయిన తెలుగుదేశంతో పొత్తుకు సైతం సిద్ధపడి సీపీఐని, తెలంగాణ జన సమితి(టీజేఎస్‌) లను కూడా కలుపుకొని ప్రజా కూటమి పేరుతో ఎన్నికల బరిలో నిల్చింది. ఎలాగైనా అధికరాంలోకి రావాలని  తహతహలాడిన కాంగ్రెస్‌ పార్టీ అందుకు తగినట్టుగా సకాలంలో అభ్యర్థుల్ని మాత్రం ఖరారు చేసుకోలేకపోయింది. తమ పార్టీలోనూ, కూటమిలోనూ కూడా చివరి నిమిషం వరకూ గందరగోళాన్ని మిగిల్చింది. తెలంగాణలోని వివిధ జిల్లాలు మొదలుకొని రాజధానిలోని కూకట్‌పల్లి వరకూ పట్టుబడుతున్న కరెన్సీ మూటలు, బంగారం నిల్వలు తెలంగాణ ప్రజల్ని దిగ్భాంతికి గురిచేసాయి. . ఇందులో కరెన్సీ విలువ రూ. 129 కోట్లుకాగా, బంగారం విలువ రూ. 8 కోట్లని వార్తలొస్తున్నాయి. ఇవిగాక లక్షలాది రూపాయల మద్యం ఏరులై పారింది.  ఈ నెల 11న వెలువడే ఫలితాల్లో ఎవరు విజేతలో తేలనుంది. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు ఎవరు కరెక్ట్‌గా చెప్పారో తేలనుంది.