ఇసుక అక్రమంగా తరలిస్తున్న లారీలపై అధికారుల కొరడా
నల్గొండ: అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలపై జిల్లా అధికారులు కొరడా ఝళిపించారు. వేములపల్లి మండలంలో ఇసుక అక్రమంగా తరలిస్తున్న ఐదు లారీలను ఆర్టీవో శ్రీనివాస్‌రెడ్డి ఈ రోజు ఉదయం పట్టుకున్నారు. లారీలపై కేసు నమోదు చేయడంతో పాటు ఒక్కో లారీకి రూ. లక్ష చొప్పున జరిమానా విధించారు.