ఇసుక టిప్పర్ పట్టివేత..

ఊరుకొండ, అక్టోబర్ 22 (జనం సాక్షి):
అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్ ను పోలీసులు పట్టుకున్న సంఘటన మండలంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మిడ్జిల్ మండలంలోని దుందుభి వాగు నుండి అక్రమంగా.. ఎలాంటి అనుమతులు లేకుండా ఊర్కొండ మండలంలోని ఊర్కొండ పేటకు తరలిస్తుండగా.. ఊర్కొండ పేట శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం వద్ద పోలీసులు పట్టుకొని పొలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ విషయం స్థానిక ఎస్ఐ లక్ష్మణ్ ని వివరణ కోరగా.. పట్టుకున్నామని దీనిపై విచారణ చేస్తున్నామని తెలిపారు. అక్రమంగా తరలిస్తున్న ఇసుక టిప్పర్ యజమానిపై కేసు నమోదు చేస్తారో లేదో అనే అనుమానాలను మండల ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.