ఇసుక తరలింపు కేసులో 8మంది అరెస్టు
నెల్లికుదురు : మండలంలోని వివిధ గ్రామాలకు సమీపంలో ఉన్న అకేరు వాగు నుంచి ఇతర మండలాలకు అక్రమంగా ఇసుక తరలిస్తున్న 8 మందిని అరెస్టు చేసినట్లు స్థానిక ఎస్సై జూపల్లి వెంకటరత్నం తెలిపారు.పరిసర మండలాలకు ఇసుక తరలిస్తుండటంతో భూగర్బజలాలు అడుగంటిపోతున్నాయని అన్నారు. ఇసుక తరలిస్తున్న 8 ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు అయన వివరించారు.