ఇస్లాం స్వీకరించిన మల్లంపల్లి ఖాదియానీ అధ్యక్షుడు షేక్ ఫరీద్..
సాదరంగా ఆహ్వానించిన ముఫ్తి ఘియాస్ మోహియుద్దీన్
అక్కన్నపేట, నవంబర్ 8:-
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో హుస్నాబాద్ తాలుకా అక్కన్నపేట మండలం మల్లంపల్లి గ్రామానికి చెందిన అహ్మదియ్య జమాత్ ఖాధియాని గ్రామ మిర్జాడ అధ్యక్షుడు షేఖ్ ఫరీద్ మంగళవారం మస్జిద్ లో కరీంనగర్ మదర్సా అరబియా హిఫ్జుల్ ఖురాన్ ప్రిన్సిపాల్, మజ్లిస్ తహఫుజ్ ఖత్మే నబువ్వత్ కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ మౌలాన ముఫ్తి మహమ్మద్ ఘియాస్ మోహియుద్దీన్ సమక్షంలో ఇస్లామీయ సాంప్రదాయం ప్రకారం కలిమా షహాదత్ చదివి ఇస్లాం ధర్మాన్ని స్వీకరించారు. షేఖ్ ఫరీద్ ను శాలువా కప్పి, ఇస్లాం ధర్మం లోకి ముఫ్తి ఘియాస్ మోహియుద్దీన్ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముఫ్తి ఘియాస్ మాట్లాడుతూ..మల్లంపల్లిలో గత 35 సంవత్సరాలుగా ముస్లిం కుటుంబాలు మొత్తం అహ్మదియ్య ఖాదియానీ జమాత్ బారిన పడి..అల్లాహ్ విశ్వాసానికి దూరమయ్యారని, ఈనేపథ్యంలో హీర ఫౌండేషన్ కరీంనగర్ చొరవ తీసుకుని ముందుగా గ్రామంలో ఇస్లామీయ మస్జిద్ నిర్మించి.. గ్రామ ముస్లింలను ఏకతాటిపైకి తెచ్చి..గ్రామ ముస్లిం కుటుంబాలను ఖాదియానిజం నుంచి, వాళ్లు మునుపు ఉన్న ఇస్లాం ధర్మం లోకి తీసుకువచ్చేందుకు అలుపెరుగని కృషి పట్టుదలతో చేశామన్నారు. మదర్సా హిఫ్జుల్ ఖురాన్ కరీంనగర్ ద్వారా మల్లంపల్లిలో నూతనంగా నిర్మించిన ఇస్లామీయ మస్జిద్ లో మత గురువు (ఇమామ్‌ను) నియమించామన్నారు. ఇంత చేసినప్పటికీ గత ఐదేళ్లుగా ఖాదియానీ జమాత్ అధ్యక్షుడు షేక్ ఫరీద్ కుటుంబం ఒక్కటే ఖాధియానిజంను వదిలి పెట్టకుండా అందులోనే ఉండిపోయారన్నారు. షేఖ్ ఫరీద్, అతడి కుటుంబ సభ్యులు వాస్తవాలు తెలుసుకొని అల్లాహ్ వైపు, రుజుమార్గం వైపు రావడం సంతోషదాయకమన్నారు. రాబోయే రోజుల్లో ఫరిద్ కుటుంబానికి తామంతా అండగా ఉంటామన్నారు. ఈకార్యక్రమంలో హుస్నాబాద్ పట్టణ టిఆర్ఎస్ అధ్యక్షుడు ఎండి అబ్దుల్ వహబ్ అన్వర్, మౌలాన సలీముద్దీన్ అల్ హసని, ముక్తదార్ ముఖరం, కలీంశరీఫ్, తౌహీద్, అబ్దుల్ రాఫె తదితరులు ఉన్నారు.