ఈజిప్టులో ఘోరం

3

ఫుట్‌బాల్‌ తొక్కిసలాటలో 25 మందు మృతి

కైరో,ఫిబ్రవరి 9(జనంసాక్షి): ఫుట్‌ బాల్‌ మ్యాచ్‌ సందర్భంగా 25 మంది మృతి చెందిన సంఘటన ఈజిప్టులో చోటు చేసుకుంది. టికెట్ల విషయంలో అభిమానులకు, పోలీసులకు మధ్య జరిగిన వాగ్వివాదం తొలిక్కసలాటకు దారి తీసింది. తూర్పు కైరోలో రెండు స్థానిక జట్ల మధ్య సాకర్‌ మ్యచ్‌ను తిలకించడానికి వచ్చిన అభిమానులకు స్టేడియంలోకి ప్రవేశించడానికి ఒకే సన్నని ద్వారాన్ని అనుమతించడంతో వారు ఆగ్రహానికి గురయ్యారు. అంతే కాకుండా ముప్ఫై వేల సామర్థ్యం గల మైదానంలోకి పదివేల మందికే అనుమతించడంతో, కొందరు టికెట్లు లేకుండా స్టేడియంలోకి ప్రవేశించడంతో పోలీసులు వారిపైకి భాష్ప వాయు గోళాలు ప్రయోగించారు. ఇది ఘోర తొక్కిసలాటకు దారి తీసి 25 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు.  వివరాల్లోకెళితే.. కైరోలో ఈజిప్టు జాతీయ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఈ మ్యాచ్‌ను తిలకించేందుకు కొందరు ఫుట్‌బాల్‌ అభిమానులు టికెట్‌ లేకుండా ఎయిర్‌ డిఫెన్స్‌ స్టేడియంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఇది గమనించిన భద్రతా దళాలు వారిని అదుపు చేసేందుకు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించింది. దీంతో ఫుట్‌బాల్‌ అభిమానులు, భద్రతా దళాల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ ఘర్షణలో తొక్కీసలాట జరిగి ఊపిరాకడపోవడం కారణంగా వీరు చనిపోయారని అధికారులు ధృవీకరించారు. అయితే ఈ హింసాత్మకమైన ఘటనపై స్పందించిన ఈజిప్టు ప్రభుత్వం నిరవధికంగా జాతియ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ను రద్దు చేసింది. ఇదిలాఉండగా 2012లో కూడా ఇదే తరహాలో జరిగిన ఘర్షణలో 70 మందికి పైగా మృతి చెందారు.