ఈజిప్టు విమన శకలాల గుర్తింపు

3
కైరో,మే20(జనంసాక్షి):పారిస్‌ నుంచి కైరో వెళ్తూ నిన్న కుప్పకూలిన ఈజిప్టు ఎయిర్‌వేస్‌ విమానానికి సంబంధించిన శకలాలను మధ్యదరా సముద్రంలో గుర్తించినట్లు ఈజిప్టు ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఈజిప్టు తీర నగరం అలెగ్జాండ్రి యాకు సుమారు 290కి.విూల దూరంలో ఈజిప్టు ఎయిర్‌క్రాఫ్ట్‌, నేవీ వెస్సల్స్‌ విమాన శకలాలు గుర్తించినట్లు ఆర్మీ అధికార ప్రతి నిధి ఫేస్‌బుక్‌ పేజీలో పోస్ట్‌ చేశారు. విమాన శకలాలను గ్రీస్‌ సవిూపంలో గుర్తించినట్లు నిన్న వచ్చిన వార్తలు తప్పని ఈరోజు ఉదయం ఈజిప్టు ఎయిర్‌ తెలిపిన విషయం తెలిసిందే.ఫ్రాన్స్‌ నుంచి 66 మందితో కైరో వెళ్తున్న ఎయిర్‌బస్‌ ఏ320 విమానం గురువారం కుప్పకూలిన విషయం తెలిసిందే. ల్యాండ్‌ అవ డానికి కొద్ది నిమిషాల ముందు రాడార్‌తో విమానానికి సంబం ధాలు తెగిపోయాయి. చివరిసారిగా అలెగ్జాండ్రియా నగరానికి 280 కి.విూ దూరంలో ప్రయాణిస్తున్నప్పుడు గుర్తించినట్లు గ్రీస్‌ తెలిపింది.అలెగ్జాండ్రియాకు ఉత్తర దిశన శకలాలను గుర్తిం చారు. ప్రయాణికులకు చెందిన వస్తువులను ఆర్మీ నౌక సము ద్రంలో కనుగొన్నది. ఎయిర్‌బస్‌కు చెందిన బ్లాక్‌ బాక్స్‌ను కను గొనేందుకు ఆ ప్రాంతంలో గాలింపును ముమ్మరం చేసి నట్లు బ్రిగేడియర్‌ జనరల్‌ మొహమ్మద్‌ సవిూర్‌ తెలిపారు. ఈజి ప్ట్‌ పోర్టు నగరమైన అలెగ్జాండ్రియాకు290 కిలోవిూటర్ల దూరంలో శకలాలను గుర్తించారు. విమాన భాగాలతో పాటు ప్రయాణికుల వస్తువులను సెర్చ్‌ అధికారులు పసిగట్టారు. అయితే ఏ కారణాల చేత విమానం సముద్రంలో కూలినందన్న విషయాన్ని మాత్రం అధికారులు ఇంకా స్పష్టం చేయలేకపోతున్నారు. మరో 20 నిమిషాల్లో ల్యాండ్‌ కావాల్సి ఉన్న తరుణంలో విమానం కూలినట్లు అధికారులు తెలిపారు.ఈజిప్ట్‌ విమానం కోసం మధ్యదరా సముద్రంలో రెండు రోజులగా తీవ్ర గాలింపు చేపట్టారు. పారిస్‌ నుంచి కైరో వెళ్తూ ఈజిప్ట్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానం మార్గమధ్యలో అదృశ్యమైన విషయం తెలిసిందే. అయితే మధ్యదరా సముద్రం విూదుగా వెళ్తున్నప్పుడు విమానం రాడార్‌ సిగ్నల్స్‌కు చిక్కకుండా పోయింది. గ్రీస్‌ కపర్తోస్‌ దీవుల సవిూపంలో విమాన శకలాల కోసం తీవ్రంగా గాలించారు.గ్రీకు, ఈజిప్ట్‌, ఫ్రెంచ్‌, యూకే మిలిటరీ సెర్చ్‌ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. పారిస్‌ నుంచి కైరో వెళ్తోన్న ఎంఎస్‌804 ఫ్లయిట్‌లో 66 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎయిర్‌బస్‌ ఏ320 విమానం సముద్రంలో కుప్పకూలే ముందు రెండు సార్లు షార్ప్‌ టర్న్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత సుమారు 7620 విూటర్ల ఎత్తు నుంచి సముద్రంలో ఆ ప్లేన్‌ పడ్డట్లు అధికారులు అంటున్నారు. టెక్నికల్‌ సమస్య కన్నా టెర్రరిస్టుల వల్లే విమానం కూలి ఉంటుందని ఈజిప్ట్‌ అధికారులు భావిస్తున్నారు.

వీడని మిస్టరీ..సాంకేతిక లోపం కారణంగా విమానం కూలిపోయిందా.. లేదా ఉగ్రవాదులు కూల్చేశారా అన్నది మాత్రం ఇంకా మిస్టరీగా మిగిలిపోయింది. సాంకేతిక సమస్య తలెత్తే అవకాశమే లేదని.. ఉగ్రవాద హస్తం ఉండే అవకాశం ఉందని ఈజిప్టు చెబుతోంది. అయితే పూర్తి వివరాలు తెలిసే వరకు ఘటనకు గల కారణాలు చెప్పలేమని ఈజిప్టు ప్రధాని షరీఫ్‌ ఇస్మాయిల్‌ స్పష్టం చేశారు.