ఈడబ్ల్యూఎస్ పై సుప్రీంకోర్ట్ తీర్పు చారిత్రాత్మకం

రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కూర అంజిరెడ్డి

సిరిసిల్ల . నవంబర్.08. (జనం సాక్షి). ఆర్ధికంగా వెనుకబడిన అగ్రకుల పేదలకు ప్రభుత్వం కల్పించిన ఈడబ్ల్యూఎస్ (EWS) రెజుర్వేషన్ రద్దు కానీ, తొలంగించడం వీలుకాదని, దానిని యధావిధిగా కొనసాగించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కూర అంజిరెడ్డి పేర్కొన్నారు.

2019 లో కేంద్ర ప్రభుత్వం 103 వ రాజ్యాంగ సవరణ ద్వారా అగ్రవర్ణ పేదలకు 10 శాతం EWS రెజుర్వేషన్ ప్రవేశపెట్టిందని, దీనిని వ్యతిరేకస్తూ కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించారన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్ట్ అగ్రకుల పేదలకు కల్పించిన ఈ రెజుర్వేషన్ రాజ్యాంగబద్ధమేనని ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు. ఇది చారిత్రాత్మకం, హర్షిస్తున్నామన్నారు.

EWS రిజర్వేషన్ ద్వారా ఏ సామజిక వర్గానికి వ్యతిరేకం కాదని, ఇతర వర్గాల రిజర్వేషన్ లకు నష్టం కలగకుండా,10 శాతం సీట్లు, ఉద్యోగాలు కల్పించడమే దీని ఉద్దేశ్యం అని, గతంలో UPA, NDA ప్రభుత్వాలు అగ్రవర్ణ పేదల స్థితిగాతులపై ఏర్పాటు చేసిన మేజర్ జనరల్ సిన్హా కమీషన్ నివేదిక ఆధారంగా ఈ డబ్ల్యూఎస్ కల్పించినట్లు అంజిరెడ్డి పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు తీర్పుతో లక్షలాది మంది అగ్రవర్ణ పేదలు విద్య, ఉద్యోగాల్లో లబ్ధిపొందనున్నారని అయన తెలియజేశారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కేటగిరి విద్య, ఉద్యోగాల్లో EWS రిజర్వేషన్ సౌకర్యం చిత్త శుద్ధితో అమలు పరచాలని, రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ లో EWS రిజర్వేషన్ అభ్యర్థులు అందరికి కట్ అఫ్ మార్కులు తగ్గించాలని డిమాండ్ చేశారు.