ఈడి విచారణకై కాంగ్రెస్ శ్రేణులు ధర్నా చేయగా అరెస్ట్ చేసిన పోలీసులు గాంధారి

_గాంధారి జనంసాక్షి జులై 21
నేటి రోజు తెలంగాణ పిసిసి అధ్యక్షులు ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీమతి సోనియా గాంధీ ని ఈడి విచారణ పేరిట వేధించడాన్ని ఇబ్బందులు పెట్టడాన్ని నిరసిస్తూ హైదరాబాదులోని ED కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమానికి వెళ్తున్న గాంధారి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూర్పు రాజులు . పట్టణ అధ్యక్షుడు నీల రవి బీసీ సెల్ నాయకులు రమేష్ రావు కిసాన్ సెల్ అధ్యక్షులు లక్ష్మణ్ రైతు నాయకులు ఎంద్రల్ గోపాల్ వార్డు మెంబర్ సంఘం బాబా మైనార్టీ నాయకులు రహమత్ గౌస్ మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు రవి . వీరందరిని వారి ఇళ్లలో ఉదయం 5 గంటలకు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ఈ సందర్భంగా తూర్పు రాజు మాట్లాడుతూ పాలకులు ప్రజా కంటకులుగా మారి ప్రతిపక్ష నాయకులను వేధించడాన్ని విచారణ పేరిట ఇబ్బందులు పెట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆయన ఆరోపించాడు