ఈ’డెన్’ఎవరిదో నేటి నుండే ఇంగ్లాండ్-భారత్ చివరి టెస్ట్
కోల్‌కత్తా, డిసెంబర్ 4: ఇంగ్లాండ్‌ను 4-0 తేడాతో ఓడించి రివేంజ్ తీర్చుకోవాలి… ఇది సిరీస్‌కు ముందు భారత జట్టు కోరిక. అహ్మాదా బాద్ టెస్ట్ విజయంతో ప్రతీకారానికి తొలి అడుగు పడిందని అభిమా నుల సంబరం.. అయితే ముంబై టెస్టుతో సీన్ రివైర్సైంది. స్పిన్‌తో ఇంగ్లీష్ టీమ్‌ను దెబ్బతీద్దామని ధోనీ రచించిన వ్యూహం బెడిసి కొట్టడంతో పాటు అదే ఉచ్చులో టీమిండియా చిక్కుకుని పరాజయం పాలైంది. ఫలితంగా సిరీస్ 1-1తో సమం. ఈ నేపథ్యంలో సొంత గడ్డపై భారత్ సత్తాకు పరీక్షగా రేపటి నుండి మూడో టెస్ట్ ప్రారంభం కాబోతోంది. ఎలాగైనా ఈ మ్యాచ్‌లో గెలిచి ఇంగ్లాండ్‌ను దెబ్బకొ ట్టాలని భారత్ భావిస్తుంటే… ముంబై టెస్ట్ విజయంతో ఉత్సాహంతో ఉన్న కుక్ సేన కాన్ఫిడెన్స్‌తో సిధ్ధమైం ది. భారత్ విషయానికొస్తే… బ్యాట్‌మెన్ నిలకడలేమి మైనస్‌గా మారింది. ఓపెనర్లతో పాటు టాపా ర్డర్ బ్యాట్స్‌మెన్ నిలకడగా రాణించలేకపోతున్నారు. గత రెండు మ్యాచ్‌లలోనూ చటేశ్వర పుజా రా ఒక్కడే సత్తా చాటాడు. తొలి టెస్టు లో సెహ్వాగ్ సెంచరీ చేసి నా… మిగిలిన ఇన్నింగ్స్‌లలో విఫలమ య్యాడు. అన్నింటికంటే ముఖ్యంగా భారత ఓపెనర్లు జట్టుకు సరైన ఆరంభాన్నివ్వలేక పోతున్నారు. గంభీర్ ఫామ్ జట్టు మేనేజ్‌మెంట్‌కు తలనొప్పిగా మారింది. అటు సచిన్ టెండూల్కర్ వైఫల్యం కూడా ఆందోళన కలిగిస్తోం ది. వరుస వైఫల్యాలతో రిటైర్మెంట్ విమర్శలను ఎదుర్కొంటున్న మాస్ట ర్ కోల్‌కత్తా టెస్టులో సత్తా చాటి వాటికి అడ్డుకట్ట వేయాలని కోరుకుం టున్నాడు. గత రెండు రోజులుగా నెట్స్‌లో ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తు న్నాడు. సచిన్‌తో పాటు కోహ్లీ, యువీ కూడా గాడిన పడాల్సి న అవసరం ఉంది. ఇక కెప్టెన్ ధోనీ వ్యక్తిగతంగా కూడా తీవ్రంగా నిరాశ పరుస్తున్నాడు. ఈ సిరీస్‌లో ధోనీ బాధ్యతా యుతంగా ఆడకపోతే టెస్ట్ జట్టులో చోటు కోల్పోయే ప్రమాదం ఉన్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. ఆట కంటే వేరే విషయాలలో భారత సారథి వివాదాలలో నిలుస్తున్నాడు. సిరీస్ ప్రారంభం నుండీ పిచ్‌పై విమర్శలు చేస్తోన్న ధోనీ తాజాగా కోల్‌కత్తా మ్యాచ్‌కు కూడా స్పిన్ పిచ్ కావాలని డిమాండ్ చేశాడు. దీనికి అంగీ కరించిన క్యూరేటర్‌ను తప్పిం చడంలో మహీదే కీలక పాత్ర. ఈ వివాదం తాతాలికంగా సద్దు మణిగినప్పటకీ.. పూర్తి ఆత్మ రక్షణ ధోరణితో స్పిన్ పిచ్‌లు కావాలని కోరడం సరికాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు . దీంతో రేపటి మ్యాచ్‌లో ఎవ రు గెలుస్తారనేది పకన పెడితే పిచ్ దేనికి అనుకూలంగా ఉం టుందనేది ఆసక్తికరంగా మారిం ది. ఇక భారత తుది జ ట్టు విషయానికొస్తే హర్భజన్ ను పక్కన పెట్టే అవకాశా లున్నాయి. గత మ్యాచ్‌లో పేస్ బౌలర్‌ను తప్పించి భజ్జీని తుది జట్టులోకి తీసుకోవడం విమర్శలకు దారితీసింది. దీంతో రేపటి మ్యాచ్ కు ఇశాంత్, దిండాలలో ఒకరికి చోటు దక్కనుంది. మరోవైపు ముంబై లో గ్రాండ్ విక్టరీ కొట్టిన ఇంగ్లాండ్ అదే జోరు కొనసాగించాలని ఉత్సాహంతో ఎదురుచూస్తోంది. ఇంగ్లాండ్ స్పిన్ ద్వయం స్వాన్-పనేసర్ వాంఖేడేలో అదరగొట్టారు. కోల్‌కత్తాలో తమ స్పిన్ మ్యాజిక్ చూపా లని భావిస్తున్నారు. వీరికి తోడు ఫిన్ కూడా ఫిట్‌నెస్ సాధిం చాడు. బ్యాటింగ్‌లో కుక్ వరుస సెంచరీలతో సూపర్ ఫామ్‌లో కొన సాగు తున్నాడు. పీటర్సన్ కూడా ముంబై టెస్టులో సెంచరీ చేసి ఫామ్ లోకి రావడంతో ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ మరింత బలపడింది. స్టీవెన్ ఫిన్ మార్పు తప్పిస్తే… మిగిలిన జట్టంతా ముంబై మ్యాచ్‌లో ఆడినదే బరిలోకి దిగే అవకాశాలున్నాయి.
భారత్‌ః
సెహ్వాగ్, గంభీర్, సచిన్, కోహ్లీ, పుజారా, యువరాజ్‌సింగ్, ధోనీ, అశ్విన్, జహీర్‌ఖాన్, ఇశాంత్ శర్మ, దిండా, ప్రగ్యాన్ ఓజా
ఇంగ్లాండ్‌ః
కాంప్టన్, అలెస్టర్ కుక్, జొనాథన్ ట్రాట్, పీటర్సన్, బెల్, మోర్గాన్, సమ్మిత్‌పటేల్, ప్రియర్, బ్రాడ్, ఫిన్, స్వాన్, మాంటీ పనేసర్, ఆండర్సన్.